పిల్లలు ఫిట్‌గా ఉన్నారా?
close
Updated : 09/11/2021 02:15 IST

పిల్లలు ఫిట్‌గా ఉన్నారా?

కొవిడ్‌ కారణంగా పిల్లలు ఏడాదికి పైగా ఇంట్లోనే గడిపారు. బయటకు వెళ్లడం, ఇతర పిల్లలతో కలవడం అలవాటు తప్పింది. ఈ మధ్యనే బడులకు వెళ్తున్నా గతంలోలా చురుగ్గా ఉండటం లేదని అమ్మల ఫిర్యాదులు. అందుకే వీరితో చిన్న చిన్న వ్యాయామాలు చేయిస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

పుల్‌ అప్స్‌...  చిన్నారులతో రోజూ 30 నుంచి 50 పుల్‌ అప్స్‌ చేయించండి. ఇవి ఎత్తు పెరగడానికి దోహదపడతాయి.

క్రంచెస్‌... చిన్నారికి బాస్కెట్‌ బాల్‌ లేదా ఫుట్‌బాల్‌ క్రీడలో శిక్షణ ఇప్పించండి. రోజూ 30-50 క్రంచెస్‌ చేయించండి. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగి ఫిట్‌గా కనిపిస్తారు.

జంపింగ్‌ జాక్స్‌... పిల్లలకు నచ్చే ఫన్‌ వ్యాయామమిది. ఇది చిన్నారుల ఎముకలను బలంగా, దృఢంగా మారుస్తుంది.

పుషప్స్‌... ఇది శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందిస్తుంది. రోజూ చిన్నారితో 30 పుషప్స్‌ చేయించండి.

తాడాట, పరుగు... ఇవి మెదడు - శరీరం రెండిటికీ ఆరోగ్యాన్నిస్తాయి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని