నేను కాదు... మనం

పెళ్లికి ముందు ఎంతో స్నేహంగా ఉన్న జంట ఆ తర్వాత మాత్రం కొన్నాళ్లకే శత్రువుల్లా నిత్యం ఒకరిపై మరొకరు మండిపడుతుంటారు. మరికొందరేమో.. ముందుగా పరిచయం లేకపోయినా, దంపతులైన తర్వాత...

Published : 15 Nov 2021 00:36 IST

పెళ్లికి ముందు ఎంతో స్నేహంగా ఉన్న జంట ఆ తర్వాత మాత్రం కొన్నాళ్లకే శత్రువుల్లా నిత్యం ఒకరిపై మరొకరు మండిపడుతుంటారు. మరికొందరేమో.. ముందుగా పరిచయం లేకపోయినా, దంపతులైన తర్వాత అన్యోన్యంగా ఉంటారు. దాంపత్యంలో ఇరువురిమధ్య తొలిరోజుల్లో ఉండే ప్రేమ జీవితాంతం కొనసాగితేనే ఆ బంధం బలంగా పెనవేసుకుంటుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.  

‘మనం’గా.. చదువు పూర్తయి, ఉద్యోగం వచ్చేవరకు ప్రతి అంశంలో నాకు.. నేను అనే భావనలో ఉండటం సహజం. అయితే పెళ్లైన తర్వాత నా అనే ఆలోచనను మనంగా మార్చుకోవాలి. సినిమా, షాపింగ్‌, స్నేహితులను కలవడం వంటివాటికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. కొత్తలో కలిసి వెళ్లినా క్రమేపీ కొందరు ఆ పద్ధతిని మార్చుకుంటారు. దాంతో దంపతుల మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. పనులెన్ని ఉన్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం వెచ్చించాలి. తమ కోసమే అన్నట్లుగా కష్టసుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి.  

ప్రత్యేక సమయాల్లో కాకుండా... కొందరు తమ మనసులోని ప్రేమను భార్య లేదా భర్తకు వ్యక్తీకరించడానికి ప్రత్యేక సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తారు. ఈ పద్ధతి భాగస్వామికి నచ్చకపోవచ్చు. లేదంటే తమపై ప్రేమ లేదని అపోహపడొచ్చు. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే చిన్నచిన్న సందర్భాల్లో కూడా మీ మనసులోని ప్రేమను వారిని దగ్గరకు తీసుకుని చెప్పాలి.

అభిరుచులను...  ఇరుగు పొరుగు, స్నేహితుల అభిరుచులు, అలవాట్లు తెలుసుకునే కొందరు తమ జీవితభాగస్వామి గురించి మాత్రం ఆసక్తి చూపరు. జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అలా ఒకరి గురించి మరొకరికి తెలిసినప్పుడు సందర్భాని బట్టి నడుచుకోవడం అలవడుతుంది. దాంతో సమస్యలకు తావుండదు. అలాగే ఎదుటివారిని గౌరవించి వారికి తగినట్లుగా సర్దుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు తమపై వారికెంత ప్రేమ ఉందో భాగస్వామికి అర్థమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్