close
Published : 03/12/2021 00:24 IST

బుజ్జాయికి వెచ్చగా...

చలిగాలుల ప్రభావం నవజాత శిశువులపై ఎక్కువగా ఉంటుంది. కొత్తగా అమ్మయిన వాళ్లకి చిన్నారుల సంరక్షణ విషయంలో కొంత బెంగ ఉంటుంది. ఈ వాతావరణంలో వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారిలా..

రోజులు, నెలల వయసున్న శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో చలిగాలులకు పలురకాల ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. శ్వాస సంబంధిత సమస్యల ప్రమాదమూ ఉంది. వారి లోదుస్తులను వేడినీటితో శుభ్రం చేసి ఎండలో బాగా ఆరనివ్వాలి. వాళ్ల పరిసరాలను దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు దోమలు, కీటకాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* వెచ్చగా... చలి ఎక్కువగా ఉంటోంటే.. పాపాయి గదిలో పోర్టబుల్‌ హీటర్‌ ఉంచండి. ఎక్కువ వేడిగా కాకుండా వెచ్చ దనాన్ని, తేమను బ్యాలెన్స్‌ చేసేలా చూసుకోవాలి. చిన్నారికి హాయిగా అనిపిస్తుంది. వారి సున్నిత చర్మం పొడిబారకుండా మిల్క్‌ క్రీం, వెన్నతో తయారయ్యే మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి.

* మర్దన.. బుజ్జాయి ఒంటికి రోజూ మృదువుగా మర్దనా చేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచి, రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. శరీరమూ త్వరగా చల్లబడదు. నిద్రపోయేటప్పుడు వెచ్చగా ఉండాలని బరువైన దుప్పట్లు కప్పకండి. తేలికైన, మృదువైన వస్త్రాన్ని కప్పితే, నిద్రలో పాపాయి కాళ్లూ, చేతులు కదపడానికి వీలుగా ఉంటుంది. ఇంకా.. ప్రమాదవశాత్తు దళసరి దుప్పటి ముఖంపై పడితే పాప ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుంది.

* సౌకర్యంగా.. ఇంట్లో ఉన్నప్పుడు బరువైన దుస్తులు, స్వెటర్‌, గ్లవుజులు, సాక్సులు వంటివి వేయకండి. బుజ్జాయికి చిరాకు కలిగి, గుక్కపెడతారు. గది వెచ్చగా ఉన్నప్పుడు ఈ రకమైన వస్త్రధారణ అవసరం ఉండదు. తేలికైన, సౌకర్యంగా ఉండేవే మేలు. బయటికి తీసుకెళ్లాల్సి వస్తే చలి నుంచి కాపాడటానికి అప్పుడు వేస్తే చాలు.


Advertisement

Tags :

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి