ఒంటరిగా ఉండొద్దండీ!

సుధ కాలేజీలో ఎవరితోనూ మాట్లాడదు. ఇంటికెవరైనా బంధులొచ్చినా తనగదిలోకి వెళ్లిపోతుంది. ఇలా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారిని ఇంట్రావర్ట్స్‌ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మంచి లక్షణం కాదు.. మార్చుకోమంటున్నారు. ఎలాగంటే..

Updated : 12 Dec 2021 04:29 IST

సుధ కాలేజీలో ఎవరితోనూ మాట్లాడదు. ఇంటికెవరైనా బంధులొచ్చినా తనగదిలోకి వెళ్లిపోతుంది. ఇలా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారిని ఇంట్రావర్ట్స్‌ అంటున్నారు మానసిక నిపుణులు. ఇది మంచి లక్షణం కాదు.. మార్చుకోమంటున్నారు. ఎలాగంటే..

* పిల్లల్లో ఈ తరహా ప్రవర్తన కనిపిస్తే తల్లిదండ్రులే నలుగురిలో కలిసేలా ప్రోత్సహించాలి. లేదంటే ఆత్మన్యూనత పెరిగి, వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతాయి. ఓటమి, గెలుపుల అర్థం తెలియదు. తమకన్నా ముందంజలో ఉన్నవారిని చూసి అసూయపడటం, వారి గెలుపును ఆస్వాదించలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* కాలేజీ స్థాయి వారైతే తామెందుకు నలుగురితో కలవడానికి ఇష్టపడటంలేదో ఆలోచించాలి. నేనింతే, ఇలాగే ఉంటా అని భావించొద్దు. అందరితో కలిసి మాట్లాడటానికి ప్రయత్నించడం, క్రీడల్లో పాల్గొనడం, ఇంట్లో అందరితో కలిసి సరదాగా మాట్లాడటం వంటివి సాధన చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. తోబుట్టువులతో కలిసిమెలిసి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే నైపుణ్యాలు పెరిగి అనుకున్నది సాధించగలుగుతారు.

* విమర్శలను సానుకూలంగా తీసుకోవాలి. మీలోని లోపాన్ని గుర్తించినంత మాత్రాన ఎదుటివారిని అపార్థం చేసుకుని కోపాన్ని ప్రదర్శించకూడదు. దీన్ని అధిగమించాలంటే ముందు మీరు మంచి శ్రోతగా మారాలి. అవతలివ్యక్తి చెప్పేది ప్రశాంతంగా వినగలగాలి. దీంతో ఏకాగ్రత అలవడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్