ఆ స్వేచ్ఛ ఇవ్వండి

అమ్మూకి నెలసరి మొదలైనప్పటి నుంచీ బోలెడు సందేహాలు.  తల్లిని అడగడానికేమో మొహమాటం. దాంతో నెట్‌లో సమాచారం వెదుకుతోంది. ఇలాంటి సందర్భం ప్రతి టీనేజ్‌ అమ్మాయికి ఎదురవుతుంది. ఆడపిల్లల సందేహాలను అమ్మే తీర్చాలి. ఆ స్వేచ్ఛను వారికి ఇవ్వాలంటున్నారు మానసిక నిపుణులు. ఎదిగే క్రమంలో ఆడపిల్లకు శరీరంలో కలిగే మార్పులను తల్లి ఎప్పటికప్పుడు చెప్పాలి. టీనేజ్‌లోకి అడుగుపెట్టడం నుంచి హార్మోన్ల మార్పుల వరకు వివరించాలి. చదువుకునే వయసులో ఇలాంటి

Updated : 16 Dec 2021 04:43 IST

అమ్మూకి నెలసరి మొదలైనప్పటి నుంచీ బోలెడు సందేహాలు.  తల్లిని అడగడానికేమో మొహమాటం. దాంతో నెట్‌లో సమాచారం వెదుకుతోంది. ఇలాంటి సందర్భం ప్రతి టీనేజ్‌ అమ్మాయికి ఎదురవుతుంది. ఆడపిల్లల సందేహాలను అమ్మే తీర్చాలి. ఆ స్వేచ్ఛను వారికి ఇవ్వాలంటున్నారు మానసిక నిపుణులు.

ప్రేమగా...

ఎదిగే క్రమంలో ఆడపిల్లకు శరీరంలో కలిగే మార్పులను తల్లి ఎప్పటికప్పుడు చెప్పాలి. టీనేజ్‌లోకి అడుగుపెట్టడం నుంచి హార్మోన్ల మార్పుల వరకు వివరించాలి. చదువుకునే వయసులో ఇలాంటి విషయాలెందుకని భావించొద్దు. అలా చేస్తే వారి భవిష్యత్తుకు ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. ఆడపిల్లగా నాకే శరీరంలో ఇన్ని మార్పులెందుకు అని భావించే ఆడపిల్లలకు ఇది ప్రకృతి సిద్ధమైందని అర్థమయ్యేలా చెప్పే బాధ్యత తల్లిదే. ప్రేమగా, మృదువుగా వివరిస్తే పిల్లలకు తమ శరీరం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెలసరిలో వచ్చే నొప్పివంటి అసౌకర్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధపడతారు.

తప్పించుకోవద్దు..

పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొందరు తల్లులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా తప్పు. ఏ అంశమైనా వారు అడిగినప్పుడు పూర్తిగా వివరించాలి. అలాకాకుండా ‘అలాంటి సందేహాలు అడగొద్దు తప్పు.. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు’ అని వారిని ఆదిలోనే ఆపేస్తే, వారు అయోమయంలోకి జారిపోతారు. మనసునిండా ఎన్నో ప్రశ్నలున్నా.. పైకి అడగలేక లోలోపల సతమతమవుతారు. అది వారి కెరీర్‌పైనా ప్రభావం చూపుతుంది. అందుకే అప్పుడే వారి సందేహాలకు సమాధానాలను చెబితే చిన్నారి మనసు తేలికవుతుంది.

వాస్తవం

నెలసరి ప్రారంభమవడం, ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులు, వ్యక్తిగత శుభ్రత... ఇలా అన్నింటి గురించి విడమరచి చెప్పాలి. యుక్తవయసులోకి అడుగుపెడుతున్న అమ్మాయికి లైంగిక విజ్ఞానం గురించి మెల్లిమెల్లిగా చెప్పాలి.  శరీరంలో జరిగే జీవక్రియలతోపాటు ఎదుర్కోవాల్సిన సవాళ్లనూ అనుభవాలతో కలిపి వివరించగలిగితే చాలు. నిర్భయంగా ముందుకు అడుగేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్