Updated : 18/12/2021 05:19 IST

నేర్పితే నేర్చుకుంటారు..

ఉద్యోగినులకి పిల్లల పెంపకం పెద్ద సవాలే. వాళ్ల మీద పూర్తి శ్రద్ధ పెట్టడానికి ఉండదు. మరి ఉన్న సమయంలోనే వాళ్ల గురించి ఆలోచించాలి... తీర్చిదిద్దాలి. అందుకు ఛైౖల్డ్‌ సైకాలజిస్టులు సూచిస్తున్న సలహాలేంటో చూద్దాం...

మీకెంత తీరిక లేకున్నా వాళ్ల కోసం కొంత సమయం కేటాయించండి. వాళ్ల స్థాయికి దిగిపోయి ఆడండి, పాడండి. ఈ చిన్న కిటుకు చెప్పలేనంత మేలు చేస్తుంది. మారాం చేయడాలు, మొండితనాలు చూపడాలూ మాని మీ మాట వింటారు.

* క్యారంబోర్డు లాంటివి ఆడిన తర్వాత హాల్లోనే ఉంచకుండా తీసిన చోట పెట్టమని చెప్పండి. అలా ఏ వస్తువు ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టేయడం అలవాటు చేసుకుంటారు. ఇదొక క్రమశిక్షణలా మారుతుంది.
* పిల్లలు కదా అని ప్రతిదీ అందివ్వాలని చూస్తే వాళ్లంతట వాళ్లు ఏ పనీ చేసుకోలేరు. బాల్యం నుంచీ చిట్టి చేతులతో చిన్నిచిన్ని పనులు చేయమని చెబుతూ, చక్కగా చేశావని ప్రశంసిస్తూ ఉంటే స్వయం సామర్థ్యాలు పెరుగుతాయి. పెద్దయ్యేకొద్దీ మీకూ సాయంగా ఉంటారు.
* చిన్నారులు టీవీలు, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోతున్నారని బాధపడి ప్రయోజనం లేదు. వాళ్లు వాటికి అలవాటు పడకుండా చూడటం పెద్దల బాధ్యతే. పిల్లల కథల పుస్తకాలు చదివి చెబుతూ, వాళ్లూ చదివేలా ప్రోత్సహించాలి. చదవడంలో ఉండే ఆనందం అర్థమయ్యేలా చేస్తే ఆనక వాళ్లే చదువుతారు. నేర్పాలే గానీ ఏదైనా నేర్చుకుంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని