సోషల్‌ మీడియా డిటాక్స్‌...

అభయకు ఇంటిల్లపాదిని చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. భర్త, పిల్లలు 24 గంటలూ ఫోన్‌లోనే. ఇలా సామాజిక మాధ్యమాల వినియోగం కుటుంబం, స్నేహితుల అనుబంధాన్ని దూరం చేసే ప్రమాదం ఉందం టున్నారు మానసిక నిపుణులు.

Published : 05 Jan 2022 01:44 IST

అభయకు ఇంటిల్లపాదిని చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. భర్త, పిల్లలు 24 గంటలూ ఫోన్‌లోనే. ఇలా సామాజిక మాధ్యమాల వినియోగం కుటుంబం, స్నేహితుల అనుబంధాన్ని దూరం చేసే ప్రమాదం ఉందం టున్నారు మానసిక నిపుణులు.

రీరంలోని మలినాలను వెలికి తీసినట్లే సోషల్‌ మీడియా డిటాక్స్‌ కూడా ప్రతి వ్యక్తికీ అత్యవసరం. ఇందుకు కనీసం 30 రోజుల పడుతుంది. తొలగించి... ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్‌ను తొలగించాలి. లేదంటే స్నేహితుల పోస్ట్‌లుసహా తదితర సమాచారాలపై ఆలోచనలు మొదలై, అది మెల్లగా మెదడును ఆక్రమిస్తాయి. వేరే ఆలోచనకు అవకాశాన్నివ్వవు. ఏదైనా చిరుతిండిగ చూస్తే తినాలనిపిస్తుంది. ఇవన్నీ పలు అనారోగ్యాలకు కారణమవుతాయి. అందుకే యాప్స్‌ తొలగించాలి, వెబ్‌సైట్స్‌ను బ్లాక్‌ చేయాలి. స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పాలి. ఇంట్లోవారి కోసం అధిక సమయం వెచ్చించాలి. లాభాలెన్నో... సోషల్‌మీడియా డిటాక్స్‌తో ఎంతో విలువైన సమయం చేతిలో ఉంటుంది. మన కోసం మనం వెచ్చించుకునేలా ఇది ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అనుబంధం పెంపొందుతుంది. శారీరక, మానసికారోగ్యం కలుగుతుంది. ఆ తర్వాత సామాజిక మాధ్యమాలను ఎంతవరకు వినియోగించాలో అనే స్వీయ నియంత్రణ అలవడటంతోపాటు ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని దూరంగా ఉంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్