వీటిని మాత్రం పంచుకోవద్దు!

ఇతర బంధాల్లాగే స్నేహానికి ఎక్కువ విలువిస్తాం. అందుకే అమ్మానాన్న, భర్తతో పంచుకోలేని విషయాల్నీ స్నేహితులతో పంచుకుంటుంటాం. అయితే భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో మాత్రం ఈ విధానానికి స్వస్తి పలకమంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Published : 21 Feb 2022 01:28 IST

ఇతర బంధాల్లాగే స్నేహానికి ఎక్కువ విలువిస్తాం. అందుకే అమ్మానాన్న, భర్తతో పంచుకోలేని విషయాల్నీ స్నేహితులతో పంచుకుంటుంటాం. అయితే భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో మాత్రం ఈ విధానానికి స్వస్తి పలకమంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* మీ స్నేహితులందరూ మీవారికీ నచ్చాలని లేదు. వాళ్లలో ఎవరిదైనా ప్రవర్తనో, వేషధారణ విషయంలోనో మీ దగ్గర అసంతృప్తి ప్రదర్శిస్తే ఆ విషయాన్ని వాళ్ల దగ్గర ప్రస్తావించకండి. పోనీ వాళ్లు బాధ పడతారని వేరే మిత్రురాలి వద్దా వాపోకండి. అది ఆయన అభిప్రాయమంతే. మీకూ మీవారి ఫ్రెండ్స్‌లో అందరూ నచ్చాలని లేదు కదా! కాబట్టి, దాన్ని ఎవరివద్దా చర్చించకండి. ఇది మీ ఇద్దరి బంధం చెడిపోకుండా ఉంచడమే కాకుండా మీపై మీవారి నమ్మకాన్ని కోల్పోకుండానూ ఉంటారు.
* భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం వారికే ప్రత్యేకం. బయటివారితో ప్రవర్తన గంభీరంగా ఉండొచ్చు. మీవద్ద కాస్త సున్నితంగానే ఉంటారు. దాన్ని మూడో వ్యక్తి వద్ద బయటపెట్టడం అంత మంచిది కాదు.
* ఆర్థిక విషయాల్లో తప్పటడుగులు మామూలే. ఏదైనా వ్యాపారం చేసో, పొరబాటు కారణంగానో నష్టపోయారనుకోండి.. స్నేహితుల దగ్గర మాత్రం నిందించకండి. అది వారికి అవమానంగా తోయొచ్చు. ఆర్థిక అవసరం అయితే అడిగి తీసుకోండి. కానీ ఆయనదే పొరబాటు అంటూ మాట్లాడకండి. అలాంటివి మనసులోనే ఉంచుకోండి.
* ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. అందరివీ అన్నీ ఎదుటివాళ్లకి నచ్చాలని లేదు. పోనీ ఆ అలవాట్లు మీకు అవమానంగా తోస్తున్నాయా.. మీ భాగస్వామితోనే నెమ్మదిగా చర్చించండి. మాన్పించే ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీ మిత్రుల దగ్గర వాపోయారో.. అది మీ వారికి తెలిస్తే అవమానకరంగా ఉండదూ! ఈ విషయంలోనూ నోటికి తాళం వేసేయండి. స్నేహితులు దగ్గరివారే.. కానీ ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత విషయాలుంటాయని గుర్తుంచుకోవడం ప్రధానం కదా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్