జ్ఞాపకశక్తి పెంచేద్దామా!

పిల్లలు చదువుల్లో చురుగ్గా ఉండాలని ప్రతి అమ్మానాన్నా కోరుకుంటారు. వాళ్లు వెనకబడుతోంటే నిరాశ పడతారు... కొన్నిసార్లు అసహనానికీ గురవుతారు. అందుకే చిన్ని బుర్రలకు గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి పెంచడానికి ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.

Updated : 27 Feb 2022 05:57 IST

పిల్లలు చదువుల్లో చురుగ్గా ఉండాలని ప్రతి అమ్మానాన్నా కోరుకుంటారు. వాళ్లు వెనకబడుతోంటే నిరాశ పడతారు... కొన్నిసార్లు అసహనానికీ గురవుతారు. అందుకే చిన్ని బుర్రలకు గ్రహణ శక్తి, జ్ఞాపకశక్తి పెంచడానికి ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి.

* వెక్కిరించండి.. నైపుణ్యాలు నేర్పుతామని వెక్కిరించమంటారేంటి అనుకుంటున్నారా! దీని వల్ల మాట్లాడగల నైపుణ్యాలు పెరుగు తాయట. కాబట్టి పిల్లల ముందు నాలుకను బయటకు తీసి అన్ని వైపులా తిప్పుతూ వాళ్లూ చేసేలా ప్రోత్సహించండి. బయటి వాళ్ల ముందు మాత్రం అలా చేయొద్దని చెప్పడం మర్చిపోవద్దు.

* మెమరీ గేమ్స్‌.. పదాలు గుర్తుంచుకోవడం, పజిల్స్‌ లాంటివి చేయించండి. మీరూ వాళ్లతో కలిసి చేస్తే ఉత్సాహంగా చేస్తారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

* చదివించండి.. పుస్తకాలను అలవాటు చేయండి. ఒక్కసారిగా కష్టమే! కానీ.. ఓపిగ్గా కూర్చొని చెబితే కచ్చితంగా అలవాటు అవుతుంది. ఇది ఊహాశక్తినే కాదు నేర్చుకోగల నైపుణ్యాలనూ పెంచుతుంది. ఎక్కువ కాలం గుర్తుండటానికీ కారణమవుతుంది. మీరూ కొంత సమయం పుస్తకం తీసుకుని కూర్చుంటూ ఉంటే.. కొనసాగించేలా చేసిన వారూ అవుతారు.

* సంగీతం.. పాటలు వింటూ హమ్‌ చేస్తున్నారా? లేకపోయినా దాన్ని అలవాటు చేసి, ప్రోత్సహించండి. వివిధ భాషలవి వినిపించండి. భాషతోపాటు మెమరీ కూడా పెరుగుతుంది. ఏదైనా వాద్యం నేర్చుకునేలా చూసినా.. ఫలితం బాగుంటుంది.

* పోషకాహారం.. ఇది శారీరకంగా, మానసికంగా రెండు విధాలా ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకూ కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచండి. సీ ఫుడ్‌, నట్స్‌, పప్పుధాన్యాలనూ చేర్చండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్