పిల్లల మీద అరుస్తున్నారా..

చిన్నారులంటేనే అల్లరికి చిరునామా. ఒక్కోసారి వారు చేసిన పనులు నవ్వును తెప్పిస్తే మరికొన్నిసార్లు చెప్పలేనంత కోపాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో గట్టిగా అరిచేస్తాం. తర్వాత అయ్యో ఇలా అన్నామే అని బాధపడతాం. అయితే ఇలాంటి సమయాల్లోనే సంయమనం పాటించాలంటారు నిపుణులు. మీ కోపం తగ్గడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.

Published : 10 Mar 2022 02:31 IST

చిన్నారులంటేనే అల్లరికి చిరునామా. ఒక్కోసారి వారు చేసిన పనులు నవ్వును తెప్పిస్తే మరికొన్నిసార్లు చెప్పలేనంత కోపాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో గట్టిగా అరిచేస్తాం. తర్వాత అయ్యో ఇలా అన్నామే అని బాధపడతాం. అయితే ఇలాంటి సమయాల్లోనే సంయమనం పాటించాలంటారు నిపుణులు. మీ కోపం తగ్గడానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.

ట్టిగా గాలి పీల్చండి... ఇలా చేస్తే కోపం వెంటనే తగ్గిపోతుంది. చిన్నారి చేసిన తప్పిదంతో కోపంలో ఉన్న మీరు వారిని ఏమీ అనకుండా ఒక్క నిమిషం శ్వాస మీద దృష్టి పెట్టండి. గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలేయండి. మీ కోపం చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత వారితో మాట్లాడేటప్పుడు కేకలు వేయరు.

మృదువుగా... పిల్లల అల్లరి చేష్టలను ఆపడానికి పెద్దలు కేకలు వేస్తుండటం సహజమే. గట్టిగా మందలించడం వల్ల చిన్నారులు ఆ కాసేపటికి అల్లరి ఆపినా ఆ తర్వాతా దాన్ని కొనసాగిస్తారు. కాబట్టి చిన్నారుల్లో మీకేదైనా నచ్చని అంశం ఉంటే కరుకుగా కాకుండా మృదువుగా చెప్పి చూడండి. తప్పక వింటారు.

కారణం కనుక్కోండి... కొందరు చిన్నారులు ఎంత చెప్పినా పదే పదే తప్పిదాలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు అమ్మానాన్నల కోపం తారస్థాయికి చేరుతుంది. అయితే ఈసారి కూడా తిట్టడం లాంటివి చేయకుండా అసలు తను పొరపాటు చేయడానికి కారణమేంటో కనుక్కోండి.

నియమాలు పాటించమనండి.. మీ అరుపులు, కేకలు పిల్లలపై ప్రతికూల ప్రభావాలను చూపొద్దనుకుంటే ఇలా చేయండి. ఇంటి సభ్యులందరికీ కొన్ని నియమాలు పెట్టండి. వాటిని  కుటుంబ సభ్యులంతా పాటించేలా చూడండి. ఒకవేళ చిన్నారి వాటిని పాటించకపోతే దానికి తగిన శిక్షను వేయండి. కాసేపు మాట్లాడకుండా ఉండండి. తిట్టడం కంటే మౌనంగా ఉండటం వల్ల ‘అమ్మకు కోపం వచ్చింది అని అనుకోకుండా అమ్మ బాధపడుతుంది’ అని తెలుసుకుంటారు. బుద్ధిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్