అసలే పరీక్షలు.. జాగ్రత్త మరి!

మొదట్నుంచీ చదువుతున్నా.. పరీక్షలు దగ్గరికొచ్చే సరికి కంగారుపడే అమ్మాయిలే ఎక్కువ. దీంతో ముందు నుంచే ఆందోళనతో నిద్రకు దూరమవుతుంటారు. కానీ ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది

Updated : 03 Apr 2022 06:42 IST

మొదట్నుంచీ చదువుతున్నా.. పరీక్షలు దగ్గరికొచ్చే సరికి కంగారుపడే అమ్మాయిలే ఎక్కువ. దీంతో ముందు నుంచే ఆందోళనతో నిద్రకు దూరమవుతుంటారు. కానీ ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు.. కాబట్టి..

* రోజుల తరబడి నిద్ర తగ్గించి చదివినా.. తీరా పరీక్ష రోజు ఆ ప్రభావం పడొచ్చు. ఎంతో బాగా వచ్చిందీ పరీక్ష సమయంలో మర్చిపోతుండటానికి ఇదే కారణం. కాబట్టి పడుకోవడం, లేవడం ఒకే సమయానికి జరిగేలా చూసుకోండి. ఎక్కువ గంటలు పడుకోకపోయినా నిద్రలో నాణ్యతైనా పెరుగుతుంది.

* చాలామందికి చిన్నలైటుని అయినా ఉంచుకునే అలవాటు ఉంటుంది. తెల్ల, నీలి కాంతులు మెదడుపై ప్రభావం చూపుతాయట. దీంతో త్వరగా నిద్రపట్టదు. సరిగా విశ్రాంతి లేదంటే మళ్లీ ఆ ప్రభావం పడేది చదువుపైనే! వీలైతే గదిని పూర్తిగా చీకటిగా మార్చుకునేలా చూసుకోండి.

* శారీరకమే కాదు.. మానసిక శ్రమా నీరసపడేలా చేస్తుంది. పేరుకు తిన్నామనిపించడం, ఉత్సాహం కలిగించడం కోసం టీ, కాఫీలపై ఆధారపడటం చేయకండి. ఇవి మెదడును బలవంతంగా ఉత్తేజితం చేస్తుంటాయి. నిద్రకీ దూరం చేయగలవు. ఎక్కువగా  తేలికపాటి ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. ముఖ్యంగా రాత్రివేళల్లో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే వాటికి దూరంగా ఉండాలి. ఏడింటికల్లా ముగిస్తే ఇంకా మంచిది. ఆకలనిపించినా పండ్లు, తక్కువ నూనె పదార్థాలకు ప్రాధాన్యమివ్వండి.

* దీర్ఘకాలం నిద్రలేమి నెలసరిపైనా ప్రభావం చూపగలదు. హార్మోన్లలతో తేడా మనసును స్థితిమితంగా ఉండనీయదు. దీంతో కంగారు ఎక్కువవుతుంది. వీలైనంతవరకూ ప్రశాంతంగా ఉండండి. సన్నద్ధత మధ్యలో చిన్న విరామాలను తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్