పాప చెప్పదు... మనమే తెలుసుకోవాలి...
మా పాపకు మూడున్నరేళ్లు. మూత్రం వస్తోందని చెప్పదు. ఆకలేస్తోందని అడగదు. స్కూల్లో పెద్దగా మాట్లాడదని టీచర్ ఫిర్యాదు. మాటలు రావని కాదు. అక్షరాలూ, అంకెలూ గుర్తుపడుతుంది. పొడి పదాలు చెబుతుంది, వాక్యాలు పలకదు. బంధుత్వాలు పలికినా, పిలవదు. ఇదేమైనా సమస్యా..
మా పాపకు మూడున్నరేళ్లు. మూత్రం వస్తోందని చెప్పదు. ఆకలేస్తోందని అడగదు. స్కూల్లో పెద్దగా మాట్లాడదని టీచర్ ఫిర్యాదు. మాటలు రావని కాదు. అక్షరాలూ, అంకెలూ గుర్తుపడుతుంది. పొడి పదాలు చెబుతుంది, వాక్యాలు పలకదు. బంధుత్వాలు పలికినా, పిలవదు. ఇదేమైనా సమస్యా.. కాస్త తెలియజేయండి!
- ఓ సోదరి
ఈ వయసుకి మూడు పదాల వాక్యాలను మాట్లాడగలగాలి. తన అవసరాలను మాటలూ చేతలతో వివరించాలి. మీ చిన్నారి వెనకబాటుకు కారణాలేంటో చూడాలి. పుట్టినప్పుడు తక్కువ బరువుందా? మాటలు ఆలస్యమవడం, తన పనులు తాను చేసుకోలేకపోవడం, ఇతరులతో మాట్లాడలేకపోవడం మొదలైన లక్షణాలనుబట్టి వ్యక్తిగత, సామాజిక నైపుణ్యాల్లో వెనకబడినట్లు కనిపిస్తోంది. ఇది గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే కావచ్చు. పాప బంధువులను పిలవదంటే ఆటిజం డెవలప్‌మెంటల్ డిజార్డర్ ఉందేమో! సిగ్గూబిడియాలు, కలివిడితనం లేకపోవడం, వాక్యాలు మాట్లాడలేకపోవడాన్ని ‘స్కిల్స్ డిలే లేదా ఎక్స్‌ప్రెసివ్ డిలే’ అంటారు. వీటిల్లో ఏదైనా కారణం కావొచ్చు. చైల్డ్ సైకాలజిస్టును కలిస్తే సైకలాజికల్ పరీక్షలో మెదడు ఎదుగుదలను అంచనా వేస్తారు. స్పీచ్ అసెస్‌మెంట్ చేసి, ఆటిజం లక్షణాలున్నాయా అని చూస్తారు. ఐదేళ్లలోపు చిన్నారుల ప్రవర్తనను బట్టి వైద్యుని సంప్రదిస్తే న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్, ఆటిజం డెవలప్‌మెంటల్ డిజార్డర్ ఉందో లేదో పరీక్షిస్తారు. స్పీచ్ ఇవాల్యుయేషన్ చేస్తారు. చిన్నారి స్థితికి తగ్గట్టుగా తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్, స్పీచ్ థెరపీ ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.