అబద్ధాలు చెబుతుంటే...

అహల్య భర్త తరచూ ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటాడు. ఇవి చిన్నవైతే సర్దుకుపోవచ్చు. కొందరు పెద్ద అబద్ధాలు చెబుతూ భాగస్వామిని మోసం చేస్తుంటారు. వీరిని క్షమించాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. నిపుణులేం చెబుతున్నారో చూద్దాం. అరుదుగా... జీవిత భాగస్వామితో కొందరు చిన్న గా అబద్ధాలు చెబుతుంటారు. అప్పుడు నిజం కన్నా ఆ చిన్న అబద్ధమే వారి మధ్య కలతలను దూరం చేయొచ్చు.  దీన్ని గుర్తిస్తే ఎదుటివారు తమతో అలా...

Updated : 13 May 2022 06:34 IST

అహల్య భర్త తరచూ ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటాడు. ఇవి చిన్నవైతే సర్దుకుపోవచ్చు. కొందరు పెద్ద అబద్ధాలు చెబుతూ భాగస్వామిని మోసం చేస్తుంటారు. వీరిని క్షమించాలా వద్దా అని ఆలోచిస్తున్నారా.. నిపుణులేం చెబుతున్నారో చూద్దాం.

అరుదుగా... జీవిత భాగస్వామితో కొందరు చిన్న గా అబద్ధాలు చెబుతుంటారు. అప్పుడు నిజం కన్నా ఆ చిన్న అబద్ధమే వారి మధ్య కలతలను దూరం చేయొచ్చు.  దీన్ని గుర్తిస్తే ఎదుటివారు తమతో అలా ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. అలా చేయొద్దని చెబితే సమస్య ఉండదు. దాన్ని పెద్ద సమస్యగా చేస్తే కలతలు తప్పవు. ఆలోచిస్తూ అడుగేస్తేనే సంసారం సాగుతుంది.

అవకాశం.. కొందరు చిన్నచిన్న విషయాలకే అబద్ధం చెబుతారు.  ఈ అలవాటును మార్చడానికి భాగస్వామి ప్రయత్నించాలి. దాన్ని గుర్తించినప్పుడు ఆ క్షణంలోనే ప్రశ్నించాలి. అలా ప్రవర్తించొద్దని చెప్పి, క్షమించి, మారడానికి అవకాశాన్నివ్వాలి. అబద్ధం ఎప్పటికైనా తెలుస్తుందనేది తెలియజేయాలి. వారిలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించాలి.  

మీ గురించి.. అవతలి వ్యక్తి ఎందుకలా మాట్లాడుతున్నారో గ్రహించాలి. ముందుగా మీ గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీకు తెలియకుండా మీరే ఎదుటి వారు అబద్ధం చెప్పక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారేమో గుర్తించండి. అలా చెబితేనే మీరు సంతోషిస్తారనే భావం మీ భాగస్వామికి ఉందని తెలిస్తే మాత్రం దాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడినా మీకు సమస్య లేదంటే అదే వారితో చెప్పండి. క్రమేపీ అబద్ధాలు మానేస్తారు. ఇలా చేస్తే ఇద్దరికీ  ప్రశాంతంగా ఉంటుంది. ఒకరినొకరు క్షమించుకొనే గుణం ఉంటే ఆ సంసార నావ సంతోషంగా సాగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్