మొదటి ప్రాధాన్యం ఇవ్వండి చాలు...

భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకోవడం మొదలుపెట్టాక ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. సర్దుబాట్లూ చేసుకోవాలి. గొడవలూ, అలకలూ కూడా తప్పకపోవచ్చు. అంతమాత్రాన ఒకరిపై మరొకరికి ప్రేమ లేదని కాదు.

Published : 15 Mar 2024 01:41 IST

భార్యాభర్తలుగా జీవితాన్ని పంచుకోవడం మొదలుపెట్టాక ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. సర్దుబాట్లూ చేసుకోవాలి. గొడవలూ, అలకలూ కూడా తప్పకపోవచ్చు. అంతమాత్రాన ఒకరిపై మరొకరికి ప్రేమ లేదని కాదు. ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని అర్థం అంటారు నిపుణులు. కాబట్టి...

  • మీ భాగస్వామిలోనే కాదు... ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలుంటాయి. అవి మీరు చూసే దృష్టిని బట్టే పెద్దవా? చిన్నవా? అనే విషయం ఆధారపడి ఉంటుంది. అలాకాకుండా మీ అభిరుచులకు అనుగుణంగా అవతలివారి పనుల్ని లోపాలుగా లెక్కేస్తేనే అసలు సమస్య. ఇలాంటప్పుడు మీరు సర్దుకుపోవడం, అవతలివారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడమూ అవసరమే. ఒకవేళ నిజంగానే మీలో ఏదైనా లోపం కనిపిస్తే నెమ్మదిగా అధిగమించడానికి ప్రయత్నించాలి. అవతలివారిలోనే సమస్య ఉంటే వారు దాన్ని దాటడానికి తోడుండాలి.
  • భార్యాభర్తలుగా ఒక బంధంలో కలిసి ఉన్నా... ఎవరికి వారు నచ్చినట్లు ఉండటం, అదే సమయంలో ప్రతిదీ తనకు నచ్చినట్లే చేయాలని పట్టుబట్టడం రెండూ సరికాదు. భార్య అయినా భర్త అయినా తన ప్రాధాన్యతల్లో మొదటి స్థానం వారికే ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురుకావు. ఇద్దరి మధ్య నమ్మకం కూడా పెరుగుతుంది.
  • అందరూ తమ ప్రేమను ఒకేలా వ్యక్తం చేయలేరు. అలాగని అవతలివారికి మీరంటే ఇష్టం లేదనేసుకోకండి. దాన్ని సరైన దిశలో వ్యక్తం చేసేందుకు మీ తోడ్పాటునివ్వండి. అవతలివారు అర్థం చేసుకోలేకపోతుంటే మీరే నేరుగా... వారి నుంచి ఏం కోరుకుంటున్నారో స్పష్టత ఇవ్వండి. మీ ఇష్టాయిష్టాలు పంచుకోండి. అర్థం చేసుకుంటారు. మీరూ సంతోషంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్