అమ్మ ప్రేమ అలానే ఉంటుంది

‘నేనెంత సంపాదించినా...ఆ డబ్బులతో మా అమ్మ ఆశ ఎప్పుడూ ధనవంతురాలు కావాలనుకోలేదు. పాతికేళ్లు ఉపాధ్యాయినిగా పని చేసిన ఆవిడ ఈ వయసులోనూ వ్యవసాయం చేయడానికి వెనుకాడట్లేదు.

Published : 21 Jul 2023 00:01 IST

- కంగనా రనౌత్‌, బాలీవుడ్‌ నటి

‘నేనెంత సంపాదించినా...ఆ డబ్బులతో మా అమ్మ ఆశ ఎప్పుడూ ధనవంతురాలు కావాలనుకోలేదు. పాతికేళ్లు ఉపాధ్యాయినిగా పని చేసిన ఆవిడ ఈ వయసులోనూ వ్యవసాయం చేయడానికి వెనుకాడట్లేదు. ఊళ్లో తాను స్వయంగా పండించిన సేంద్రియ కూరగాయలు, ఆవుపాలు, ప్లమ్‌ పండ్లు, దేశీయ నెయ్యి వంటివన్నీ తీసుకుని నన్ను చూడటానికి ముంబయి వచ్చింది. ప్రయాణంలో పండ్లు నలిగిపోయి సూట్‌కేస్‌ పాడయ్యింది. నాన్న వాటిని చూసి కోపంతో ‘అవి నీ దగ్గరకు వచ్చే వరకూ ఉండవని తెలిసినా మీ అమ్మ ప్యాక్‌ చేసింది’ అన్నారు. ఎంతైనా అమ్మ కదా...అవి ఉంటాయేమోనన్న ఆశతో తెచ్చింది. అవి పాడై నేను తినలేకపోయినా... అమ్మ ప్రేమతో నా మనసు నిండిపోయింది. లవ్యూ మమ్మా!’ అంటూ తల్లి గురించి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది కంగన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని