శీతలం... సౌందర్యం

త్వరలో వేసవి ప్రతాపం మొదలుకానుంది. ఇలాంటి సమయంలో ఇంటికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందించి, ఎండవేడిని లోపలికి రాకుండా నిరోధిస్తాయి వెదురు తెరలు. బాల్కనీ, వరండా, పడకగది అంటూ దేనికి దానికి ప్రత్యేకంగా వీటిని చేస్తున్నారు. అవసరానికి.. ఉదయపుటెండ ఎక్కువగా పడే వరండా, బాల్కనీల్లో వెదురు తెరలను ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గించడానికి వీలుగా ఈ వెదురు తెరలకు ఒక వైపు నూలు లేదా పాథిన్‌

Updated : 26 Feb 2022 05:47 IST

త్వరలో వేసవి ప్రతాపం మొదలుకానుంది. ఇలాంటి సమయంలో ఇంటికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందించి, ఎండవేడిని లోపలికి రాకుండా నిరోధిస్తాయి వెదురు తెరలు. బాల్కనీ, వరండా, పడకగది అంటూ దేనికి దానికి ప్రత్యేకంగా వీటిని చేస్తున్నారు.

అవసరానికి.. ఉదయపుటెండ ఎక్కువగా పడే వరండా, బాల్కనీల్లో వెదురు తెరలను ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గించడానికి వీలుగా ఈ వెదురు తెరలకు ఒక వైపు నూలు లేదా పాలిథిన్‌ రెక్సిన్‌ షీటును కుడతారు. దీంతో అది వేడిని నిరోధిస్తుంది. అవసరమైనప్పుడు, ఎండను తట్టుకోలేనప్పుడు దీన్ని పూర్తిగా కిందకి దింపేసి ఆ ప్రాంతాన్ని మూసేయొచ్చు. దాంతో ఎండ వేడి రాదు. సాయంత్రం సమయంలో ఈ వెదురు తెరను చుట్టేసి పైకి కట్టేసుకోవచ్చు. వరండా, బాల్కనీలకు సరిపడేలా ఇవి లభ్యమవుతున్నాయి. మురికి పట్టినప్పుడు వీటిని శుభ్రం చేసుకోవచ్చు కూడా.

పడకగదికి... కిటికీ బయటివైపు వెదురు తెరను అమర్చుకుంటే వేడిని లోపలకి రానివ్వకుండా చల్లగా ఉంచుతుంది. దుమ్ము, ధూళిని నిరోధిస్తుంది. లోపలివైపు కనపడేలా గది గోడలకు మ్యాచింగ్‌ వర్ణంలో వస్త్రాన్ని ఈ వెదురు తెరకు లోపలివైపున జత చేస్తే అందంగా కనిపిస్తుంది. హాలును ఇతర గదుల నుంచి విభజించడానికీ ఈ తెరలను వినియోగించుకోవచ్చు. ఇది హాలుకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చి పెడుతుంది. హాల్లో కిటికీ లోపలివైపు వేయడానికీ పలురకాల వెదురు తెరలు లభ్యమవుతున్నాయి. వీటికి లోపలి వైపు ప్రకృతిదృశ్యాల పెయింటింగ్‌ లేదా అవి ఉన్న వస్త్రాన్ని కుడతారు.

లోపలివైపు.. పడకగది, పిల్లల గది కిటికీలకు లోపలి వైపున వేసుకోవడానికి ‘ఇండోర్‌ విండో క్లోజర్‌ కర్టెన్లు’ లభ్యమవుతున్నాయి. వీటికి రంగురంగుల కాటన్‌ వస్త్రాన్ని జత చేయడంతో ఇవి గది గోడలకు మ్యాచింగ్‌గా కనిపిస్తూ.. ప్రత్యేక అందాన్నీ తెస్తాయి. వంటగది కోసమూ ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. వెదురుతో తయారవుతున్న ఈ తెరలు రెండు భాగాలుగా ఉంటాయి. కిటికీ పైన, కింది భాగాలను మాత్రమే మూయగలిగేలా చాప, మధ్యలో కొంత ఖాళీ భాగం ఉంటుంది. వంటగదిలోని ఆవిరి, వేడి బయటికి పోయేలా ఇవి ఉపయోగపడతాయి. అలాగే వీటిని అవసరం లేనప్పుడు పక్కకి జరుపుకొనేలా హుక్స్‌ ఏర్పాటుతో సౌకర్యవంతంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని