మొక్కలపై ఇళ్లు..

హాల్‌ మధ్యలో బల్ల మీద ఉన్న ఇండోర్‌ మొక్కపైన చిన్న ఇల్లు కడితే ఎలా ఉంటుందని ఊహించండి. దానిపై ఇల్లేంటి అనుకోవద్దు. ఇవే మినియేచర్‌ ట్రీ హట్స్‌. ఈ హట్స్‌ను రెండు రకాల మొక్కలపై కట్టుకోవచ్చు. ఇండోర్‌, అలాగే వామన వృక్షాలపై ఇవి చక్కగా ఇమిడిపోతాయి. ఇండోర్‌ అయితే ముందుగానే మొక్క ఏపుగా పెరిగిన తొట్టెను ఎంచుకోవాలి. ఇందులోని...

Updated : 13 May 2022 06:24 IST

హాల్‌ మధ్యలో బల్ల మీద ఉన్న ఇండోర్‌ మొక్కపైన చిన్న ఇల్లు కడితే ఎలా ఉంటుందని ఊహించండి. దానిపై ఇల్లేంటి అనుకోవద్దు. ఇవే మినియేచర్‌ ట్రీ హట్స్‌.

హట్స్‌ను రెండు రకాల మొక్కలపై కట్టుకోవచ్చు. ఇండోర్‌, అలాగే వామన వృక్షాలపై ఇవి చక్కగా ఇమిడిపోతాయి. ఇండోర్‌ అయితే ముందుగానే మొక్క ఏపుగా పెరిగిన తొట్టెను ఎంచుకోవాలి. ఇందులోని మట్టిలోనే ఇంటిని కడుతూ, మధ్యలో మొక్కను ఫ్రీగా వదలాలి. తొట్టెలో నాలుగువైపులా నాలుగు అంగుళాల పొడవున్న వెదురు ముక్కలను గుచ్చాలి. వాటిపై చిన్న బాల్కనీలా మరో చెక్కనుంచి ఫెవికాల్‌తో అతికించాలి. దీనిపై చిన్న హట్‌ను చెక్క ముక్కలతో నిర్మించాలి. చిన్న తాళ్ల నిచ్చెనను పైనుంచి కిందకు వేలాడదీయాలి. మొక్క  మొదలు దగ్గర మాత్రమే నీటిని పోస్తే ఎదుగుతూ.. పైన ఉన్న హట్‌కు అల్లుకుంటుంది. గదిలో ఏమూల ఉంచినా అందంగా కనిపిస్తుంది.  

వామన వృక్షాలపై.. ముందుగా ఏయే మొక్కలపై ట్రీ హట్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారో, వాటికి బలమైన కొమ్మలుండేట్లు చూడాలి. ఒక పల్చని చెక్కపై బాల్కనీ ఉండేలా చిన్న ఇంటిని తయారుచేసి ఉంచుకోవాలి. మొక్క కాండానికి సరిపోయేలా బాల్కనీకి చిన్న రంధ్రం చేసి అందులో మొక్కకు ఓ వైపుగా వచ్చేలా ఆ కొమ్మకు ఇంటిని అమర్చాలి. ఎక్కువ కొమ్మలున్న మొక్కకైతే వాటిమధ్య ఇమిడేలా చిన్న ఇంటిని తేలికైన అట్ట/ చెక్కతో రూపొందించి అమర్చితే చాలు. చివరిగా చిన్న తాళ్ల నిచ్చెనను పై నుంచి వేలాడదీస్తే చాలు. గదికే ఈ మొక్క కొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్