వీటి శుభ్రతా పట్టించుకోండి!
ఇంటి శుభ్రత కోసమని గచ్చు తుడవడం, బాత్రూమ్ కడగడం, పక్క దుప్పట్లు మార్చడం లాంటివెన్నో చేస్తుంటాం. ఇవే కాదు.. అనారోగ్యాన్ని తెచ్చే ఇంకొన్నీ ఉన్నాయి. మరి వాటినీ పట్టించుకుంటు న్నారా? చాలామంది లక్ష్యం..ఇల్లు మరకల్లేకుండా కనిపించాలనే! అందుకే సింకు, బాత్రూమ్ గచ్చు వంటివి రుద్ది రుద్ది కడిగేస్తుంటాం.
ఇంటి శుభ్రత కోసమని గచ్చు తుడవడం, బాత్రూమ్ కడగడం, పక్క దుప్పట్లు మార్చడం లాంటివెన్నో చేస్తుంటాం. ఇవే కాదు.. అనారోగ్యాన్ని తెచ్చే ఇంకొన్నీ ఉన్నాయి. మరి వాటినీ పట్టించుకుంటున్నారా?
* చాలామంది లక్ష్యం..ఇల్లు మరకల్లేకుండా కనిపించాలనే! అందుకే సింకు, బాత్రూమ్ గచ్చు వంటివి రుద్ది రుద్ది కడిగేస్తుంటాం. ట్యాపులనీ పైపైన కడిగేస్తాం. మరి వాటి లోపల? పాచి వగైరా పేరుకుపోయి అనారోగ్యాలకి దారి తీయగలవు. కాబట్టి, వాటినీ పట్టించుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్‌లో గోరువెచ్చని నీరు, వైట్ వెనిగర్ సమపాళ్లలో తీసుకొని షవర్‌హెడ్, ట్యాపులకి కట్టేయండి. 30 నిమిషాల తర్వాత తొలగించి, డెటాల్ వేసిన నీటితో కడిగేస్తే సరి.
* శుభ్రత కష్టమని త్వరగా కిటికీల జోలికి వెళ్లం. తలుపులు ముందు, వెనక తుడుస్తాం. పైభాగాన్ని త్వరగా పట్టించుకోం. అక్కడా దుమ్ము పేరుకొని అలర్జీలకు కారణమవుతాయి. స్పాంజ్ డస్టర్‌ని కత్తిరించో, మైక్రో ఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించో శుభ్రంచేయండి. పని కాస్త సులువవుతుంది.
* బూజు వగైరా దులిపేటప్పుడు బల్బులు, లైట్లకు తగలకుండా జాగ్రత్త పడతాం. లేదంటే కిందపడి పగులుతాయేమోననే భయం. డబ్బు ఖర్చుకంటే ఆ గాజు పెంకులను తొలగించడమే ఇబ్బంది మరి! కానీ వాటిమీదా బూజు, సన్నటి దుమ్ము పేరుకుంటాయని తెలుసా? శ్వాస సంబంధ సమస్యలకు దారితీసే వాటినీ గమనించుకోవాలి. నెలకోసారి అయినా హోల్డర్ నుంచి తొలగించి శుభ్రం చేసి పెట్టుకుంటే వెలుతురూ బాగుంటుంది.
* టీవీ మీద దుమ్ము చేరకుండా అందమైన అల్లికతో ఉన్న వస్త్రాలను కప్పుతుంటారు చాలా మంది. స్క్రీన్‌నీ తుడుస్తుంటారు. వెనుక గమనించారా? షూ ర్యాక్‌లు మన చెమట, దుమ్ముతో కూడిన చెప్పుల కారణంగా సూక్ష్మ జీవులకు ఆలవాలంగా మారగలవు. ఒక పరిశోధన ప్రకారం 90 శాతం సూక్ష్మజీవులు ఇంట్లోకి షూర్యాకుల నుంచే వ్యాపిస్తాయట. టీవీ వెనుక భాగాన్ని వాక్యూమ్ క్లీనర్ లేదా పొడవైన కర్రముక్కకి వస్త్రం చుట్టికానీ శుభ్రం చేయాలి. షూర్యాక్‌ని డిస్‌ఇన్ఫెక్టెంట్ క్లీనర్‌తో శుభ్రం చేయడం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.