మార్పు మంచిదే!

‘మార్పు’ శాశ్వతమైంది. జీవితంలో దీన్ని ఎప్పటికప్పుడూ ఆహ్వానిస్తూనే ఉండాలి. దీనివల్లే నిత్యనూతనంగా ఉండగలుగుతాం. అలాగే పాత, ఇబ్బందికర అలవాట్లను మార్చుకుని కొత్తవి, అవసరమయ్యే

Updated : 03 Nov 2021 06:09 IST

‘మార్పు’ శాశ్వతమైంది. జీవితంలో దీన్ని ఎప్పటికప్పుడూ ఆహ్వానిస్తూనే ఉండాలి. దీనివల్లే నిత్యనూతనంగా ఉండగలుగుతాం. అలాగే పాత, ఇబ్బందికర అలవాట్లను మార్చుకుని కొత్తవి, అవసరమయ్యే వాటిని నేర్చుకోవాలి. అలవాటూ చేసుకోవాలి. ఎలా అంటే...

ఉదయం లేవగానే ఫోన్‌ చేతిలోకి తీసుకునే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. ఏమైనా ముఖ్యమైన మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చాయా అని చూసుకుంటూంటాం. ఇది ఒకస్థాయి వరకు మంచిదే. అయితే దీన్ని కాస్త తగ్గించుకోవాలి. అదే సమయంలో లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడమో, కాఫీ తాగుతూ పత్రికలు తిరగేయడమో చేస్తే మరీ మంచిది.

* ఆఫీసుకు లేటవుతుందనో, బస్సు దొరకదనో, ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది ఉదయం పూట అల్పాహారాన్ని మానేస్తారు. ఇలా అస్సలు చేయొద్దు. ఈ ఆహారం మీ రోజువారీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కనీసం పోషకాలుండే పండ్లరసమో, స్మూథీనో తాగండి.

* అవసరం లేకపోయినా కొన్ని వస్తువులను కొనేస్తుంటారు కొందరు. ఇలా షాపింగ్‌ చేయడం వల్ల తెలియని ఆనందాన్ని పొందుతారు. అయితే దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాలి. ఆ డబ్బులనే కొద్దికొద్దిగా దాచి ఇష్టమైన హాలీడే ట్రిప్‌కు సమకూర్చుకోండి.

* సెలవు దొరగ్గానే ఆ రోజు మొత్తం ఉల్లాసంగా గడపడానికే అన్నట్లు చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. కాసేపైతే ఫరవాలేదు కానీ గంటల కొద్దీ వాటి ముందే కూర్చొంటే సమయం వృథా, కంటి ఆరోగ్యమూ దెబ్బతింటుంది. అందుకు బదులుగా ఆ రోజైనా కనీసం 30 నిమిషాలు ఇంట్లోనే కసరత్తులు మొదలుపెట్టేయండి.

* మరికొందరేమో ఏమీ తోచకపోయినా ఏదో ఒకటి నములుతూనే ఉంటారు. పనిలో కాస్త విరామం కోసమని అనుకుంటారు. అయితే ఇది కరెక్ట్‌ కాదు. దీనికి బదులుగా సమయం దొరికితే ఓ అయిదు నిమిషాలు ధ్యానం చేయండి. లేదా ఉన్న చోటే చిన్న చిన్న ఆసనాలు ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్