విశ్లేషణ చేస్తే మంచిదే!

రాశి డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సు చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆడపిల్లను వినియోగదారులకు నచ్చేలా చేయగలుగుతానో లేదో అనే సందేహం ఆమెలో మొదలైంది. ఆడపిల్లనని ఆలోచించక్కర్లేదు...

Published : 02 Jan 2022 00:20 IST

రాశి డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సు చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆడపిల్లను వినియోగదారులకు నచ్చేలా చేయగలుగుతానో లేదో అనే సందేహం ఆమెలో మొదలైంది. ఆడపిల్లనని ఆలోచించక్కర్లేదు... నైపుణ్యాలను పెంచుకుంటే విజయం మీదే అంటున్నారు నిపుణులు...

ప్రస్తుతం ఈ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది మరింత పెరుగుతోంది. అందువల్ల డిజిటల్‌ మార్కెటీర్స్‌ అధ్యయన, విశ్లేషణ సామర్థ్యాలను పెంచుకుంటూ ఉండాలి. వినియోగదారులతోపాటు వివిధ మాధ్యమాల ప్రేక్షకులు, వారి ఆలోచనా విధానం, అవసరాలను గుర్తించే సామర్థ్యం ఉండాలి. అప్పుడే వారికి కావాల్సింది మీరు అందించగలరు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ, ఆ దిశగా నైపుణ్యాల్ని పెంచుకోవాలి. సెర్చ్‌ ఇంజిన్స్‌, సామాజిక మాధ్యమాలు, ఈమెయిల్‌, ఛానెల్స్‌, బ్లాగులు వంటివి అనుసరిస్తూ ఉండాలి. ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఎక్కడి వారితోనైనా తేలిగ్గా మాట్లాడొచ్చు.

సృజనాత్మకత... ప్రస్తుతం చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటల్‌ మార్కెటింగ్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. వారి ఉత్పాదనలను లేదా సేవలను మార్కెట్‌కు ఆకర్షణీయంగా పరిచయం చేయాలి. దానికి తగిన ప్రకటనలను సృజనాత్మకంగా రూపొందిస్తే ఈ రంగంలో విజయం మీదే. 

పొందుపరుస్తూ... ఈ కామర్స్‌, ఫుడ్‌ డెలివరీ వంటి వ్యాపారాలు అంతర్జాలం ఆధారంగానే జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ ఆయా ఉత్పత్తులపై అవగాహన పెంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న వాటిని పోల్చుకుని ఉత్తమమైనది ఎంచుకుంటున్నారు. దీని వల్ల వారి ఎంపిక సామర్థ్యమూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మీ ఖాతాదారుల ఉత్పాదనలకు సంబంధించి ఆకర్షణీయ అంశాల్ని ప్రముఖంగా చెప్పడం, అవసరమైన సమాచారమంతా పొందుపరచడం, దాన్ని కాలానుగుణంగా నవీకరించడం మరవకూడదు. గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో నైపుణ్యాన్ని సాధిస్తే మీ ఆలోచనలు, సృజనాత్మకతకు అనుగుణంగా కావాల్సిన డిజైన్స్‌ మీరే చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్