ఉద్యోగం మారాలనుకుంటున్నారు...

భూమినేలే ఆశలు, నింగినెగసే ఆశయాలు, ఇంటాబయటా కష్టపడే తత్వం, రాణించాలనే పట్టుదల.. ఎన్నుంటేనేం.. ఆడవాళ్లని వివక్ష అనే అస్త్రంతో భయపెట్టి ఓ మూలకు నెట్టాలనుకోవడం, న్యూనతను పెంచి పోషించడం మామూలే కదా! ఇది ఒకనాటిది కాదు, నేటికీ జరుగుతోంది. మన వెనకబాటుకు అదీ ఒక కారణమంటే అతిశయం కాదు.

Published : 08 Oct 2022 00:34 IST

భూమినేలే ఆశలు, నింగినెగసే ఆశయాలు, ఇంటాబయటా కష్టపడే తత్వం, రాణించాలనే పట్టుదల.. ఎన్నుంటేనేం.. ఆడవాళ్లని వివక్ష అనే అస్త్రంతో భయపెట్టి ఓ మూలకు నెట్టాలనుకోవడం, న్యూనతను పెంచి పోషించడం మామూలే కదా! ఇది ఒకనాటిది కాదు, నేటికీ జరుగుతోంది. మన వెనకబాటుకు అదీ ఒక కారణమంటే అతిశయం కాదు. ఇలాంటి పరిస్థితుల వల్లే 56 శాతం మంది మహిళలు ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇది ‘విమెన్‌ ఎట్‌ వర్క్‌ 2022, ఎ గ్లోబల్‌ ఔట్‌లుక్‌’ పేరుతో డెలాయిట్‌ న్యూస్‌ నిర్వహించిన అధ్యయనంలో తేలిన సత్యం. భారత్‌ సహా పది దేశాలకు చెందిన ఐదు వేల మంది మహిళల మీద జరిపిన సర్వేలో.. 40 శాతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరొకటి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తక్కినవారు అవకాశం కోసం చూస్తున్నా మన్నారు. అందుకు కారణాలనూ వివరించారు.

లింగ వివక్షను ఎదుర్కొంటున్నాం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవమానాలు పడుతున్నాం. వివిధ సందర్భాల్లో ‘పురుషుల సామర్థ్యం ముందు మీది తక్కువ’ అంటూ గేలి చేస్తుంటారు. * పురుషులతో కలిసి ఫీల్డ్‌వర్క్‌ చేసినా, సుదూరాలు ప్రయాణించినా, రాత్రివేళల్లో పనిచేసినా మరేదో అసంతృప్తి వ్యక్తం చేసి పరాభవిస్తుంటారు.

స్త్రీలకు సాధ్యం కాదనే నెపంతో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడానికి ఇష్టపడటం లేదు.

ఇంటి బాధ్యతలన్నిటినీ సమర్థంగా నిర్వహించే మేం కార్యాలయాల్లోనూ క్లిష్టమైన అంశాలనైనా చక్కబెట్టగలం. కానీ అలాంటి నమ్మకం చూపక మమ్మల్ని పక్కన పెడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్