వీటితో ప్రేమలో పడండి

ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? వాటికి దూరంగా ఉండాలంటే వీటికి దగ్గరకండి.. స్మార్ట్‌ఫోన్ల వినియోగం వచ్చాక బుక్స్‌కి దూరమయ్యాం కానీ.. లేకపోతే వాటికంటే మంచి నేస్తాలు ఏముంటాయి?

Published : 06 Aug 2023 01:10 IST

ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? వాటికి దూరంగా ఉండాలంటే వీటికి దగ్గరకండి..

స్మార్ట్‌ఫోన్ల వినియోగం వచ్చాక బుక్స్‌కి దూరమయ్యాం కానీ.. లేకపోతే వాటికంటే మంచి నేస్తాలు ఏముంటాయి? ఒక్కసారి ఫోన్‌ పక్కనపెట్టి ఏదైనా మంచి పుస్తకాన్ని పట్టుకోండి. అది పూర్తయ్యే వరకూ లేదా మీ ఒత్తిడి తగ్గే దాకా చదువుతూ కూర్చోండి. సులువుగా సమస్య నుంచి బయటపడతారు. 

ఇంతకుముందు వారాంతపు మ్యాగజైన్లు వస్తే చాలు అందులో ఉన్న సుడోకు, పద సవరణలను పూరిస్తూ సాంత్వన పొందే వాళ్లం. ఇప్పటికీ అవి మంచి పరిష్కార మార్గాలే. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తున్న పనిని పక్కన పెట్టి పజిల్‌ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆందోళన దానికదే మాయమవుతుంది. చేస్తున్న పజిల్‌ పూర్తయితే ఏదో సాధించిన సంతోషంతో కొత్త ఉత్తేజం తోడవుతుంది. పూర్తవ్వకపోతే శ్రద్ధ పెరుగుతుంది.

చాలాసార్లు ఏవేవో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటప్పుడు మీ మెదడుకి  కాస్త విశ్రాంతి అవసరం. వారాంతంలో నచ్చిన ప్రాంతానికి వెళ్లండి. ప్రకృతి ప్రేమికులైతే జలపాతాల దగ్గర సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఒత్తిడన్న మాట మీ దరిచేరదు.

ఎక్కువ టెన్షన్‌ పడుతున్నప్పుడు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్‌ పెట్టుకుని తినండి. ఫ్లేవర్స్‌ను ఆస్వాదిస్తూ, మంచి పాటపెట్టుకుని తింటుంటే ఏ ఆందోళనైనా ఇట్టే తగ్గిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్