మారాలని గట్టిగా అనుకోండి!

మహిళా ఉద్యోగులు ఉన్నచోటే ఉండిపోకుండా ఉన్నతస్థానాలకు వెళ్లాలంటే కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలంటారు నిపుణులు. అవేంటంటారా?

Published : 16 Mar 2024 01:52 IST

మహిళా ఉద్యోగులు ఉన్నచోటే ఉండిపోకుండా ఉన్నతస్థానాలకు వెళ్లాలంటే కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలంటారు నిపుణులు. అవేంటంటారా?

  భయం మనల్ని ముందుకు కదలనివ్వదు. మీరు అనుకున్న రంగంలో స్థిరపడాలన్నా, దాంట్లో దూసుకుపోవాలన్న ముందు మీకున్న భయాలను వదిలేయండి. మహిళలు రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడతారంటారు. అది నిజం కాదని మీరు నిరూపించండి. ముందుగా మీరు ఏయే విషయాల్లో భయపడుతున్నారో ఓ పట్టిక తయారుచేసుకోండి. ఒక్కోదాన్ని అధిగమించేందుకు ప్రణాళిక రూపొందించండి. ఆ దిశగా అడుగులు వేయండి. అవసరమైతే సహోద్యోగుల సాయం తీసుకోండి. సాధన చేస్తే ఏదైనా సాధించడం సులువేనని మరిచిపోవద్దు.

♥  కొత్త విషయాలు నేర్చుకుంటేనే...మనం మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటాం. వెనకబడ్డామనే దిగులు లేకుండా పనిచేయగలం. అది కొత్త భాష, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌, ఏదైనా ప్రాజెక్టు చేయడం వంటివి ఏవైనా సరే. ఇప్పుడు యూట్యూబ్‌, వెబ్‌సైట్‌ల వంటివాటి సాయంతో ఇంటి నుంచే నేర్చుకోవచ్చు కూడా. భవిష్యత్తుని ముందే ఊహించగలిగే శక్తి వస్తే... సమర్ధవంతమైన ఉద్యోగినిగా పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

♥  సిగ్గు, బిడియం వంటివాటి వల్ల ఇతరులతో కలవలేకపోతుంటారు చాలామంది మహిళలు. నలుగురిలో కలవడం, మాట్లాడటం, నెట్‌వర్క్‌ ఏర్పరచుకోవడం వల్ల కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రయత్నం చేస్తే ఫలితం అందుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్