పాపాయికి ఫార్ములా పాలు ఇస్తున్నారా?

ప్రసవమయ్యాక పుట్టింట్లో అమ్మ సాయం ఉంటుంది. లేదంటే మేనత్తో, అత్తగారో... తమ అనుభవాన్ని రంగరించి సలహాలు ఇస్తారు. కానీ విదేశాల్లోనో... పొరుగు రాష్ట్రాల్లోనో ఉంటే సాయం చేసేవాళ్లు, సలహా ఇచ్చేవాళ్లు ఎవరుంటారు? ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న విశాఖ మహిళ గాయత్రీదేవి కనుమూరి ‘నారీకేర్‌’ స్టార్టప్‌ని ప్రారంభించారు...  

Published : 26 May 2024 17:08 IST

ప్రసవమయ్యాక పుట్టింట్లో అమ్మ సాయం ఉంటుంది. లేదంటే మేనత్తో, అత్తగారో... తమ అనుభవాన్ని రంగరించి సలహాలు ఇస్తారు. కానీ విదేశాల్లోనో... పొరుగు రాష్ట్రాల్లోనో ఉంటే సాయం చేసేవాళ్లు, సలహా ఇచ్చేవాళ్లు ఎవరుంటారు? ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న విశాఖ మహిళ గాయత్రీదేవి కనుమూరి ‘నారీకేర్‌’ స్టార్టప్‌ని ప్రారంభించారు... 

పాపాయి పుట్టిన తర్వాత తల్లి మనసులో సవాలక్ష ప్రశ్నలు మెదులుతాయి. బుజ్జాయి కడుపు నిండిందో లేదో? అసలు పాలు సరిపోతున్నాయా? ఇలా.. ఉంటుంది బాలింతల పరిస్థితి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో మాస్టర్స్‌ చేసి ఐటీ కొలువులో కుదురుకున్న గాయత్రిదీ ఇదే పరిస్థితి. ‘2020లో మాకు పాప పుట్టింది. అది కొవిడ్‌ సమయం కావడంతో వైద్యులతో మాట్లాడలేని పరిస్థితి. పాపకి సరిగా పాలు అందడం లేదేమోనని ఫార్ములా పాలు పట్టించడం మొదలుపెట్టా’ అనే గాయత్రి ఆ తరవాత మనదేశంలోని ఇంటర్నేషనల్‌ బోర్డ్‌ సర్టిఫైడ్‌ లాక్టేషన్‌ కన్సల్టెంట్‌ (ఐబీసీఎల్‌సీ)ను సంప్రదించారు. అక్కడి బ్రెస్ట్‌ ఫీడింగ్‌ నిపుణుల సాయంతో తన సందేహాలు తీర్చుకున్నారు. ‘అక్కడి నిపుణులు... నాలాంటి తల్లులందరినీ ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు. అందరివీ నాలాంటి అనుమానాలే. కాస్త అవగాహన పెరిగాక పాపకి ఫార్ములా పాలు ఆపేశా. నాకున్న అవగాహనతో కొత్తగా తల్లులైన వారికి అవగాహన తీసుకొచ్చా. అది సరిపోదనిపించి... ఉద్యోగం వదిలి ఇండియాలో 2022లో నారీకేర్‌ స్టార్టప్‌ ప్రారంభించా. ఐఐఎం బెంగళూరులో విమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రాం కోసం 4,260 మంది దరఖాస్తులు చేసుకుంటే 269 మందిని ఎంపికచేశారు. అందులో మా నారీకేర్‌ ఒకటి. బాలింతలకు తల్లిపాల విషయంలో అవగాహన కల్పించడమే మా సంస్థ లక్ష్యం. మా ఆలోచన, ఆచరణ నచ్చి ఐఐఎం బెంగళూరు రూ.8 లక్షల గ్రాంట్‌ అందించింద’నే గాయత్రి ఇటీవలే జీపీ బిర్లా ఫెలోషిప్‌నకూ ఎంపికయ్యారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న బాలింతలకు అడ్వాన్స్‌డ్, ఇంటర్నేషనల్‌ సర్టిఫైడ్‌ నిపుణుల సాయంతో సలహాలు అందిస్తున్నాం. నేరుగా మా నిపుణులతో మాట్లాడొచ్చు. అలాగే వాట్సాప్‌ గ్రూప్‌ వేదికగా సలహాలూ ఇస్తాం. బిడ్డ పుట్టిన తర్వాత పాలిచ్చేందుకు గర్భిణులను ముందుగానే సన్నద్ధం చేస్తాం. ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, యూకే దేశాల్లోని ఎన్నారైలూ మా సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వేల మంది తల్లులకు సాయం అందిస్తున్నాం. మావారు ప్రదీప్‌ దాట్ల సహకారం లేకపోతే ఇంతవరకూ వచ్చేదాన్నికాదేమో’ అంటారు గాయత్రి.

కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్