Updated : 28/03/2021 02:59 IST

ఈ లేడీస్‌ టైలర్‌కి... ఏడున్నర లక్షల మంది అభిమానులు..

13 కోట్లకు పైగా వీక్షణలు... ఏడున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు..  సెలబ్రిటీలతో సమానమైన ఇలాంటి ఆదరణని ఓ లేడీస్‌ టైలర్‌  సంపాదించుకోవడం విశేషం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో  ఉంటున్న తెలుగువారికి సైతం తేలిగ్గా అర్థమయ్యేలా టైలరింగ్‌ పాఠాలు నేర్పిస్తున్నారు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన రమ...
ఒక యూట్యూబ్‌ పాఠం జీవితాన్ని మార్చేస్తుందా?... ‘జీవితాన్ని నిలబెట్టుకునే   స్థైర్యాన్ని అయితే ఇస్తుంది. యూట్యూబ్‌ ద్వారా నేను చెప్పే టైలరింగ్‌ పాఠాలని నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న మహిళలే ఇందుకు ఉదాహరణ’ అంటారు రమ. నాలుగేళ్ల క్రితం దినపత్రికలో చూసి  యూట్యూబ్‌ ఛానెల్స్‌ గురించి తెలుసుకున్న ఆమె ‘ముద్ర వీడియోస్‌’ పేరుతో ఓ ఛానెల్‌ ప్రారంభించారు. అంతకుముందు పన్నెండేళ్లపాటు టైలర్‌గా చేసిన రమ మహిళలకు శిక్షణ కూడా ఇచ్చేవారు. బయటకు వచ్చి కుట్టుపని నేర్చుకునే వెసులుబాటు లేని మహిళలకోసం ఈ ఛానెల్‌ని ప్రాంభించారామె. బ్లౌజులు, డ్రెస్‌లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టాలో బేసిక్స్‌ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో వివరిస్తూ చేసిన తొలివీడియోనే వైరల్‌ అయింది. లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. అప్పుడే ఆమెకు ఎంత మంది మహిళలు టైలరింగ్‌ నేర్పే వీడియోల కోసం నెట్‌లో వెతుకుతున్నారో అర్థమైంది. దాంతో క్రమం తప్పకుండా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. టైలరింగ్‌పై ఏమాత్రం అవగాహన లేని వారి దగ్గరనుంచి నైపుణ్యం కలిగిన వారికి సైతం ఉపయోగపడేలా.. ఈ మూడున్నరేళ్లలో దాదాపు 1,200 వీడియోలు అప్‌లోడ్‌ చేసి.. 13 కోట్లకు పైగా వ్యూస్‌ని సంపాదించుకున్నారు. ఏడున్నర లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

‘‘లాక్‌డౌన్‌ తర్వాత ఉపాధి  కోల్పోయిన వారిలో చాలామంది నా వీడియోల ద్వారా పని నేర్చుకుని ఉపాధి పొందామని చెప్పారు. అంతకంటే సంతోషమేముంటుంది నాకు. ఇక నేరుగా నేర్చుకోవాలనుకొనే వారి కోసం వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి నోట్స్‌ ఇస్తూ.. వారానికోసారి లైవ్‌ జూమ్‌ క్లాసులు నిర్వహిస్తున్నా. ఇందుకోసం నామమాత్రపు రుసుము తీసుకుంటున్నాను. ఈ క్లాసులకు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలే కాదు... ఇతర రాష్ట్రాల్లో,  దేశాల్లో ఉంటున్నారు వారు కూడా హాజరవుతున్నారు. వెస్టిండీస్‌, కెనడా, యూఎస్‌, సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండే ఈ తరగతులకు హాజరవుతున్నారు’ అనే రమ రెండేళ్లుగా పూర్తి సమయాన్ని యూట్యూబ్‌ వీడియోలు, టైలరింగ్‌ శిక్షణకే కేటాయిస్తున్నారు.  

- సాయిప్రసాద్‌, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి