కళ్లు పొడిబారుతున్నాయా..?

ళ్లు పొడిబారుతున్నాయా.. దురదగా ఉంటున్నాయా? వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య....

Published : 23 Jul 2022 18:37 IST

కళ్లు పొడిబారుతున్నాయా.. దురదగా ఉంటున్నాయా? వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు..

ఆకుకూరలు తినాలి. కంటికి ఆకుకూరలు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.

చక్కెరను పరిమితంగా వాడాలి. రిఫైన్డ్ ఫుడ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిఫైన్డ్ ఫుడ్ ఎంత తక్కువగా తీసుకుంటే కళ్లకు అంత మంచిది.

ఉండే పదార్థాలు జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. ఇది పరోక్షంగా కళ్లు పొడిబారడానికి కారణమవుతుంది. కాబట్టి కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.

ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలి. అప్పుడే మన శరీరంలో కావలసినంత తేమ ఉంటుంది. దీనివల్ల కళ్లు కూడా పొడిబారకుండా ఉంటాయి.

పండ్ల రసాలు తీసుకుంటే కళ్లకు చాలా మంచిది. వివిధ పోషకాలను పండ్ల రసాల ద్వారా శరీరం సులభంగా గ్రహిస్తుంది.

ఎలర్జీ కలిగించే పదార్థాల వల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పదార్థాలేవో గుర్తించి వాటికి దూరంగా ఉండండి.

ఆఫీసులో కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు కనురెప్పలు ఆర్పడం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా కళ్లు పొడిబారిపోతాయి. కాబట్టి తరచుగా కనురెప్పలు ఆర్పుతుండడం మరిచిపోకండి.

కొన్ని రకాల మందుల వల్ల కూడా కళ్లు పొడిబారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని గుర్తించి వైద్యుల సలహా తీసుకోవాలి.

మధ్యమధ్యలో కనురెప్పలను మృదువుగా మర్దన చేసుకుంటే మంచిది. దీనివల్ల టియర్ గ్లాండ్స్ ప్రేరేపితమవుతాయి. తద్వారా కళ్లు తేమగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్