మెనోపాజ్ దశలో.. అందం తగ్గకుండా..!
వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్ పిరియడ్స్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ.
వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్ పిరియడ్స్, మూడ్ స్వింగ్స్, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ. చర్మం పొడిబారడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం, నిర్జీవమైపోవడం.. వంటివి మెనోపాజ్ దశకు చేరువవుతోన్న వారిలో మనం ఎక్కువగా గమనించచ్చు. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగని అందం తగ్గిపోతుందని నిరుత్సాహపడకుండా.. చర్మ సంరక్షణ విషయంలో చక్కటి రొటీన్‌ను పాటిస్తే సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
చర్మం సాగిపోతోందా?
పాడైపోయిన చర్మ కణాల్ని రిపేర్ చేయడం, కొత్త కణాల్ని ఉత్పత్తి చేయడం కొలాజెన్ పని. అలాంటి ప్రొటీన్ పనితీరు మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో తగ్గిపోతుంటుంది. తద్వారా చర్మం సాగిపోవడం, ముడతలు-గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకే కొలాజెన్ పనితీరును పెంచుకోవడానికి ‘ఎ’, ‘సి’ విటమిన్లతో తయారైన సీరమ్, క్రీమ్స్ నిపుణుల సలహా మేరకు వాడడంతో పాటు ఈ విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్ని కూడా రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి. ఈ క్రమంలో కమలాఫలం, పాలకూర, బ్రకలీ, స్ట్రాబెర్రీ.. వంటి పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
తేమను అందించే సప్లిమెంట్లు!
మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఎదురయ్యే అతి ముఖ్యమైన సమస్య చర్మం పొడిబారిపోవడం. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు కారణమట! అయితే ఇలా పొడిబారిన చర్మానికి తిరిగి తేమనందించడానికి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు, పండ్ల రసాలు.. వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే చేపలు, గుడ్లు, అవిసె గింజలు, ‘బి’ విటమిన్ ఎక్కువగా లభించే పదార్థాలు.. చక్కగా పని చేస్తాయి. మరీ అత్యవసరమైతే వైద్యుల సలహా మేరకు ఆయా పోషకాలను సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. అంతేకాదు.. రోజూ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం.. వంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం తేమగా, నవయవ్వనంగా కనిపిస్తుంది.
అవాంఛిత రోమాలు తగ్గించుకోవాలంటే..!
మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోయి, పురుష హార్మోన్లైన ఆండ్రోజెన్ స్థాయులు పెరగడం వల్ల అవాంఛిత రోమాల సమస్య అధికమవుతుంది. ఈ క్రమంలో గడ్డం, పైపెదవిపై అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. ఈ స్థితిని ‘హిర్సుటిజం’గా పిలుస్తారు. మరి, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చక్కెరలు, కార్బోహైడ్రేట్లుండే ఆహారానికి దూరంగా ఉండడం, బరువును అదుపులో ఉంచుకోవడం, డాక్టర్ సలహా మేరకు యాంటీ-ఆండ్రోజెన్ సప్లిమెంట్లు వాడడం.. వంటివి చక్కటి ఫలితాన్నిస్తాయి. అయితే ఈ అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి కొంతమంది లేజర్ చికిత్స కూడా తీసుకుంటుంటారు. కానీ సున్నిత చర్మతత్వం ఉన్నవారు, లేత చర్మ రంగు గల వారు ఈ తరహా ట్రీట్మెంట్లకు దూరంగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా ఇలాంటి సౌందర్య చికిత్సలు వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయించుకోవడం ఉత్తమం. లేదంటే దుష్ప్రభావాలను కొనితెచ్చుకున్న వారవుతారు.
‘మినరల్ మేకప్’తో మెరిసిపోవచ్చు!
మెనోపాజ్ దశలో అసలే సౌందర్య సమస్యలు.. ఆపై మేకప్ అంటే.. సంకోచిస్తుంటారు చాలామంది మహిళలు! అయితే కొంతమందికి వృత్తిపరంగా, ఇతర కారణాల వల్ల మేకప్ వేసుకోవడం తప్పనిసరి కావచ్చు! అలాంటి వారు ‘మినరల్ మేకప్’ను ఆశ్రయించడం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. ఐరన్, జింక్, టైటానియం.. వంటి సహజసిద్ధమైన ఖనిజలవణాలతో తయారుచేసే ఈ మేకప్ ఉత్పత్తుల్ని వాడడం వల్ల చర్మానికి ఎలాంటి హానీ జరగదట! పైగా సున్నితమైన చర్మతత్వం ఉన్న వారికి ఇవి మరీ మంచివట! అయితే అది కూడా తక్కువగా వేసుకోవడం మంచిది.
‘స్క్రబ్’ చేయాల్సిందే!
వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు చర్మంలోకి చేరి బ్లాక్‌హెడ్స్, మొటిమలు, మచ్చలు.. వంటి సౌందర్య సమస్యలకు కారణమవుతాయి. దీనికి మెనోపాజ్ దశ, వయసు పెరగడం.. వంటి అంశాలతో సంబంధం ఉండదు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి స్కిన్ ఎక్స్ఫోలియేషన్ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో చర్మాన్ని స్క్రబ్ చేస్తూ బ్లాక్‌హెడ్స్, జిడ్డుదనం, చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కాఫీ స్క్రబ్, చక్కెర-తేనెతో చేసిన స్క్రబ్, ఓట్మీల్ స్క్రబ్.. ఇలాంటి సహజసిద్ధమైన మిశ్రమాల్ని ఉపయోగించచ్చు.
ఇక వీటితో పాటు బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, కంటి నిండా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివి తప్పనిసరి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ మెనోపాజ్ దశలో ఇతర చర్మ సమస్యలేవైనా ఎదురైతే మాత్రం వెంటనే చర్మవ్యాధి నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
ఆరోగ్యమస్తు
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
- ఎలా తింటున్నారు
- పగలు నిద్రపోతున్నారా?
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
అనుబంధం
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
యూత్ కార్నర్
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!