ట్విస్ట్‌ బన్‌ వేసేద్దాం.. ఈజీగా!

ట్రెడిషనల్‌, మోడ్రన్‌.. అవుట్‌ఫిట్‌ ఏదైనా బన్‌ హెయిర్‌స్టైల్‌తో లుక్‌ పూర్తి చేయడం ఈ కాలపు అమ్మాలకు కామనైపోయింది. ఈ క్రమంలోనే హై, లో, ట్విస్ట్‌, టాప్‌ నాట్‌, మెస్సీ.. తరహా బన్‌ హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇవి వేసుకోవడం కష్టమనుకుంటారు కొందరు. కానీ కొన్ని గ్యాడ్జెట్స్‌ వల్ల వీటిని క్షణాల్లోనే వేసేసుకొని అందంగా

Published : 31 Mar 2022 17:55 IST

ట్రెడిషనల్‌, మోడ్రన్‌.. అవుట్‌ఫిట్‌ ఏదైనా బన్‌ హెయిర్‌స్టైల్‌తో లుక్‌ పూర్తి చేయడం ఈ కాలపు అమ్మాలకు కామనైపోయింది. ఈ క్రమంలోనే హై, లో, ట్విస్ట్‌, టాప్‌ నాట్‌, మెస్సీ.. తరహా బన్‌ హెయిర్‌స్టైల్స్‌ ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఇవి వేసుకోవడం కష్టమనుకుంటారు కొందరు. కానీ కొన్ని గ్యాడ్జెట్స్‌ వల్ల వీటిని క్షణాల్లోనే వేసేసుకొని అందంగా ముస్తాబైపోవచ్చంటున్నారు నిపుణులు. అలాంటిదే ఈ ‘ట్విస్ట్‌ బన్ రబ్బర్‌ క్లిప్‌’.

ట్విస్ట్‌ బన్‌ రబ్బర్‌ క్లిప్‌

పొడవాటి క్లిప్‌లా ఉండే దీనికి మధ్యలో చీలిక ఉంటుంది. ఇరువైపులా రెండు హుక్స్‌ ఉంటాయి. ఇప్పుడు బన్‌ హెయిర్‌స్టైల్‌ కోసం.. ముందు జుట్టును నీట్‌గా దువ్వి పోనీ వేసుకోవాలి. ఆపై ఆఖర్లో కాస్త హెయిర్‌ వదిలేసి రబ్బర్‌ బ్యాండ్‌ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ట్విస్ట్‌ బన్‌ రబ్బర్‌ క్లిప్‌ చీలికలో జుట్టు చివర్లను ఉంచి.. గుండ్రంగా పైవైపుగా చుట్టుకుంటూ రావాలి. ఆపై రౌండ్‌గా మలిచి రెండు హుక్స్‌ని ఒక దాంట్లో ఒకటి తొడిగేయాలి. ఇక చివరగా బన్‌ మొత్తాన్నీ సమానంగా పరచుకునేలా వెంట్రుకల్ని సర్దుకోవాలి. అంతే.. చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే ఈ ట్విస్ట్‌ బన్‌ వేసుకోవడమూ సులభమే కదూ! ఇలాంటి ట్విస్ట్‌ బన్‌ హెయిర్‌ క్లిప్స్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో, డిజైన్లలో లభ్యమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్