పాపాయికి ఫార్ములా పాలు ఇస్తున్నారా?
ప్రసవమయ్యాక పుట్టింట్లో అమ్మ సాయం ఉంటుంది. లేదంటే మేనత్తో, అత్తగారో... తమ అనుభవాన్ని రంగరించి సలహాలు ఇస్తారు. కానీ విదేశాల్లోనో... పొరుగు రాష్ట్రాల్లోనో ఉంటే సాయం చేసేవాళ్లు, సలహా ఇచ్చేవాళ్లు ఎవరుంటారు? ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న విశాఖ మహిళ గాయత్రీదేవి కనుమూరి ‘నారీకేర్’ స్టార్టప్‌ని ప్రారంభించారు...
ప్రసవమయ్యాక పుట్టింట్లో అమ్మ సాయం ఉంటుంది. లేదంటే మేనత్తో, అత్తగారో... తమ అనుభవాన్ని రంగరించి సలహాలు ఇస్తారు. కానీ విదేశాల్లోనో... పొరుగు రాష్ట్రాల్లోనో ఉంటే సాయం చేసేవాళ్లు, సలహా ఇచ్చేవాళ్లు ఎవరుంటారు? ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న విశాఖ మహిళ గాయత్రీదేవి కనుమూరి ‘నారీకేర్’ స్టార్టప్‌ని ప్రారంభించారు...
పాపాయి పుట్టిన తర్వాత తల్లి మనసులో సవాలక్ష ప్రశ్నలు మెదులుతాయి. బుజ్జాయి కడుపు నిండిందో లేదో? అసలు పాలు సరిపోతున్నాయా? ఇలా.. ఉంటుంది బాలింతల పరిస్థితి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో మాస్టర్స్ చేసి ఐటీ కొలువులో కుదురుకున్న గాయత్రిదీ ఇదే పరిస్థితి. ‘2020లో మాకు పాప పుట్టింది. అది కొవిడ్ సమయం కావడంతో వైద్యులతో మాట్లాడలేని పరిస్థితి. పాపకి సరిగా పాలు అందడం లేదేమోనని ఫార్ములా పాలు పట్టించడం మొదలుపెట్టా’ అనే గాయత్రి ఆ తరవాత మనదేశంలోని ఇంటర్నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ (ఐబీసీఎల్సీ)ను సంప్రదించారు. అక్కడి బ్రెస్ట్ ఫీడింగ్ నిపుణుల సాయంతో తన సందేహాలు తీర్చుకున్నారు. ‘అక్కడి నిపుణులు... నాలాంటి తల్లులందరినీ ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అందరివీ నాలాంటి అనుమానాలే. కాస్త అవగాహన పెరిగాక పాపకి ఫార్ములా పాలు ఆపేశా. నాకున్న అవగాహనతో కొత్తగా తల్లులైన వారికి అవగాహన తీసుకొచ్చా. అది సరిపోదనిపించి... ఉద్యోగం వదిలి ఇండియాలో 2022లో నారీకేర్ స్టార్టప్ ప్రారంభించా. ఐఐఎం బెంగళూరులో విమెన్ స్టార్టప్ ప్రోగ్రాం కోసం 4,260 మంది దరఖాస్తులు చేసుకుంటే 269 మందిని ఎంపికచేశారు. అందులో మా నారీకేర్ ఒకటి. బాలింతలకు తల్లిపాల విషయంలో అవగాహన కల్పించడమే మా సంస్థ లక్ష్యం. మా ఆలోచన, ఆచరణ నచ్చి ఐఐఎం బెంగళూరు రూ.8 లక్షల గ్రాంట్ అందించింద’నే గాయత్రి ఇటీవలే జీపీ బిర్లా ఫెలోషిప్నకూ ఎంపికయ్యారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న బాలింతలకు అడ్వాన్స్డ్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ నిపుణుల సాయంతో సలహాలు అందిస్తున్నాం. నేరుగా మా నిపుణులతో మాట్లాడొచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ వేదికగా సలహాలూ ఇస్తాం. బిడ్డ పుట్టిన తర్వాత పాలిచ్చేందుకు గర్భిణులను ముందుగానే సన్నద్ధం చేస్తాం. ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, యూకే దేశాల్లోని ఎన్నారైలూ మా సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వేల మంది తల్లులకు సాయం అందిస్తున్నాం. మావారు ప్రదీప్ దాట్ల సహకారం లేకపోతే ఇంతవరకూ వచ్చేదాన్నికాదేమో’ అంటారు గాయత్రి.
కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Radhika Merchant: పెళ్లి గౌనుపై.. ఇష్టసఖుడి ప్రేమలేఖ!
- జుట్టు సమస్యలను దూరం చేసే కాకర!
- మాటిమాటికీ ముఖం కడిగితే..!
- నైటీలో... బయటికీ వెళ్లొచ్చిక!
- పెళ్లయ్యాక మొటిమలు.. తగ్గేదెలా?
ఆరోగ్యమస్తు
- స్పెర్మ్ కదలిక తక్కువుంటే.. పిల్లలు పుట్టరా?
- అందుకే.. వీటికి దూరంగా ఉండడమే మేలు!
- ఆ రోజుల్లో కలిస్తే.. గర్భం ధరించే అవకాశాలు ఎక్కువట!
- ఆరోగ్యానికి ‘సూపర్ సిక్స్’
- శరీరాన్ని చల్లబరిచే శీతలి
అనుబంధం
- Father’s Day: నాన్నతో అనుబంధం.. ఎంతని చెప్పం..?
- డాడీకీ సెలవిస్తున్నారు..!
- ఫాదర్స్‌డే వెనక... ఓ అమ్మాయి!
- గొప్ప తండ్రులు!
- ఆలనా పాలనా... అంతా తానై..!
యూత్ కార్నర్
- ఆ అమ్మాయి సంకల్పంతోనే.. ‘ఫాదర్స్‌డే’..!
- నాలాంటి వాళ్లకోసం ‘డయాబెస్టీస్’
- నా హీరోకి.. ప్రేమతో..!
- బరువు తగ్గితే.. లక్షల్లో బోనస్!
- అలలతో సావాసం... అలుపెరగని పోరాటం!
'స్వీట్' హోం
- నాన్నకు ప్రేమతో..!
- ఆలనా పాలనా... అంతా తానై..!
- ఒకే బోర్డు.. ఎన్నో పనులు!
- ఇలాగైతే పాస్ అవుతానా..?
- షెల్ఫ్ లైఫ్.. ఎక్స్పైరీ తేదీ.. రెండూ ఒక్కటేనా?
వర్క్ & లైఫ్
- నాన్నే మా స్ఫూర్తి.. మా శక్తి!
- అమ్మే నాన్నైతే...!
- ‘ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నావా..’ అని వేధిస్తున్నాడు!
- అందుకే నోరు విప్పాలి!
- పచ్చని పెళ్లి సంబరం!