వయసు ఛాయలు కనపడకుండా..!
వయసు పైబడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వెళుతుంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే వీటితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు...
వయసు పైబడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు ఏర్పడటం సహజం. దీనిని నివారించడానికి చాలామంది తరచూ బ్యూటీపార్లర్‌కి వెళుతుంటారు. యాంటీ ఏజింగ్ క్రీములు రాయడం, ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే వీటితో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మరింత యవ్వనంగా కనిపించవచ్చు. మరి నిత్యయవ్వనంగా మెరిసిపోవడానికి ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాల్సిన కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందామా..
ఉసిరి..
ఉసిరిలో విటమిన్ ‘సి’ అధికంగా లభిస్తుంది. అలాగే చర్మపోషణకు అవసరమైన ఖనిజ పదార్థాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని పోషకాలు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల చర్మానికి సరైన పోషణ అందుతుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ఉసిరిని తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
సాల్మన్ చేపలు..
సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలపై పొరలా ఏర్పడి అవి పాడవకుండా చేస్తాయి. అందుకే వారానికోసారి ఈ చేపను ఆహారంగా తీసుకోవాలి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.
ఆలివ్ నూనె..
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. దీనిలో ఉన్న పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశ్యాచురేటెడ్ కొవ్వుల వల్ల వయసు మీద పడుతున్న ఛాయలు దగ్గరకి రావు. అందుకే వంటల్లో ఆలివ్‌నూనెను కూడా చేర్చుకోవాలి. అలాగే అప్పుడప్పుడు ఆలివ్ నూనెతో చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉండాలి.
డార్క్ చాక్లెట్..
సూర్యరశ్మి, అతినీలలోహిత కిరణాల ప్రభావం వల్ల కూడా చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతుంది. కొకొవా బీన్స్‌తో తయారు చేసిన డార్క్ చాక్లెట్ ఈ ప్రభావాన్ని కాస్త తగ్గిస్తుంది. దీనిలో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. అలాగే ఇది చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతుంది. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
డ్రై ఫ్రూట్స్..
బాదం, జీడిపప్పు, పిస్తాలాంటి గింజలను తినడం ద్వారా అన్శ్యాచురేటెడ్ కొవ్వులు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఆరోగ్యంగానే కాదు.. అందంగానూ తయారవ్వచ్చు. అయితే వీటిని మరీ ఎక్కువగా తినడం వల్ల లావయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మోతాదు మించకుండా జాగ్రత్త పడాలి.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి చెడు కొలెస్ట్రాల్‌ని బయటకు పంపిస్తాయి. ఫలితంగా ముఖం మీద వచ్చే ముడతలు తగ్గుముఖం పడతాయి. కొందరిలో బరువు తగ్గడం వల్ల చర్మం సాగినట్లుగా అవుతుంది. తిరిగి దాన్ని బిగుతుగా మార్చడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.
⚛ నారింజ జాతి పండ్లలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే విటమిన్ ‘సి’ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వీటిని రోజూ తింటూ ఉండాలి.
⚛ రోజూ సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల రక్తం శుద్ధిపడుతుంది. అలాగే చర్మానికి కావాల్సిన తేమ కూడా అందుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
ఆరోగ్యమస్తు
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
- నురగ స్నానం మంచిదేనా?
- కొవ్వు కరిగించే వ్యాఘ్రాసనం
అనుబంధం
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- రెడ్ రోవర్!
యూత్ కార్నర్
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
'స్వీట్' హోం
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
- ఆట ముందు... మాట్లాడాల్సిందే!
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
వర్క్ & లైఫ్
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!