చెక్కిళ్ల అందానికి..!

చాలామంది మేకప్ చేసుకునేటప్పుడు చెక్కిళ్లు/బుగ్గలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే మేకప్‌తో కాకుండా సహజసిద్ధంగా కూడా అందమైన చెక్కిళ్లను సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే..!

Published : 26 Jan 2024 13:58 IST

చాలామంది మేకప్ చేసుకునేటప్పుడు చెక్కిళ్లు/బుగ్గలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే మేకప్‌తో కాకుండా సహజసిద్ధంగా కూడా అందమైన చెక్కిళ్లను సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే..!

బీట్‌రూట్‌తో..

బీట్‌రూట్‌ రసంలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకోవాలి. తర్వాత మృదువుగా మర్దన చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సహజసిద్ధంగా మంచి రంగుని సంతరించుకొంటుంది. అలాగే చెక్కిళ్లు కూడా గులాబీ రంగులో మెరిసిపోతాయి.

అరటితో..

బాగా పండిన అరటిపండు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటిపండు చర్మానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది. బుగ్గల్ని ప్రకాశవంతంగా, మృదువుగా మార్చుతుంది.

నిమ్మ, కీరాదోస రసంతో..

నిమ్మరసం, కీరాదోస రసం కొద్ది మోతాదులో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె, పాలు కూడా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. కాసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకుంటే చెక్కిళ్లకు కొత్త కళ వస్తుంది.

పండ్లతో ప్యాక్స్‌..

సాధారణంగా ఫేషియల్ చేసుకొన్నప్పుడు లేదా చర్మం మెరుపు కోసం వివిధ ఫేస్‌ప్యాక్స్ వేసుకొంటూ ఉంటారు. అయితే ఇందుకు ఉపయోగించే ఫ్రూట్‌ప్యాక్స్‌లో ఎరుపు రంగులో ఉన్న పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తే చెక్కిళ్లకు సహజసిద్ధమైన ఎరుపుదనాన్ని తీసుకురావచ్చు.

టొమాటోలతో..

రెండు టొమాటోలు తీసుకుని గుజ్జులా చేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ఆశించిన ఫలితాలు పొందచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్