చేతులు కాలకుండా దించేద్దాం!

స్టౌ పైనుంచి వేడి గిన్నెల్ని దించడానికి ప్రతి ఒక్కరూ పట్‌కార్‌ వాడుతుంటారు. అయితే ఇది అన్ని రకాల గిన్నెలకు సరిపడకపోవచ్చు.. తద్వారా ఒక్కోసారి ఆయా గిన్నెలు జారిపోయి ప్రమాదాలూ జరగచ్చు.

Updated : 29 Jan 2024 14:05 IST

స్టౌ పైనుంచి వేడి గిన్నెల్ని దించడానికి ప్రతి ఒక్కరూ పట్‌కార్‌ వాడుతుంటారు. అయితే ఇది అన్ని రకాల గిన్నెలకు సరిపడకపోవచ్చు.. తద్వారా ఒక్కోసారి ఆయా గిన్నెలు జారిపోయి ప్రమాదాలూ జరగచ్చు. ఇలా జరగకుండా ఉండేందుకే ప్రస్తుతం వివిధ రకాల ‘బౌల్‌ గ్రిప్పర్‌ క్లిప్స్‌’ మార్కెట్లో అందుబాటులోకొచ్చాయి.

పైనుంచి ప్రెస్‌ చేస్తూ పట్టుకొనే హోల్డర్‌ మాదిరిగా, అంచులున్న బౌల్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించినవి, అంచులు లేకుండా ప్లెయిన్‌గా ఉండే బౌల్‌ను సులభంగా పట్టుకోవడానికి వీలుగా స్టాప్లర్ ఆకృతిలో తయారుచేసినవి, చిన్న చిన్న బౌల్స్‌ కోసం మరొకటి, అవెన్‌లో పెట్టిన పదార్థాలు తీయడానికి ఫింగర్‌ గ్లౌజుల మాదిరిగా తయారుచేసినవి.. ఇలా విభిన్న డిజైన్లలో ఇవి దొరుకుతున్నాయి. వీటిలో చాలావరకు సిలికాన్‌తో తయారుచేసిన లేదా కవర్‌ చేసిన హ్యాండిల్స్‌ ఉండడం వల్ల ఇవి ఉష్ణనిరోధకాలుగా పనిచేస్తాయి. కాబట్టి వీటితో గిన్నె పట్టుకుంటే కాలుతుందేమో, వేడి సెగ తగులుతుందేమోనన్న భయం అక్కర్లేదు. మరి, కిచెన్‌లో హ్యాండీగా ఉండే ఈ బౌల్‌ గ్రిప్పర్‌ క్లిప్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్