జుట్టు రాలకుండా..!

జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో- ఈ సమస్యను పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

Published : 05 Aug 2023 18:55 IST

జుట్టు విపరీతంగా రాలిపోవడం అనేది ఈ మధ్య చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటోన్న సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో- ఈ సమస్యను పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

ఈ మిశ్రమంతో..

కప్పు ఆముదం నూనెలో టీస్పూన్‌ రోజ్‌మేరీ నూనె వేసి బాగా కలపాలి. ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాస్‌ జార్‌లో భద్రపరచుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించచ్చు.. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకూ ఈ నూనె తోడ్పడుతుంది.

కొబ్బరి పాలతో సిల్కీగా!

గరుకుగా, గడ్డిలా మారిన జుట్టును రిపేర్‌ చేయడానికి కండిషనర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా మారడం గమనించచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మర్దన చేసి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు కొంతమంది. తద్వారా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకొస్తుంది. వీటితో పాటు తీసుకునే ఆహారంలో ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’.. వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే!

గమనిక:

ఇక్కడ పేర్కొన్నవన్నీ సహజమైన పదార్ధాలే అయినా కొన్ని పదార్ధాలు కొందరికి పడకపోవచ్చు. అందువల్ల వీటిని వాడే విషయంలో ఏవైనా సందేహాలున్నట్లయితే మీరు వ్యక్తిగతంగా సంప్రదించే సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్