చనిపోతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.. మా పెళ్లికి ఎలా ఒప్పించాలి?

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మాది, వాళ్లది ఒకటే కులం. కానీ మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కారణం కూడా చెప్పడం లేదు. అతను జాబ్‌ చేస్తున్నాడు. వాళ్లది మంచి కుటుంబం.. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. కానీ మా తల్లిదండ్రులే ఒప్పుకోవడం లేదు.

Published : 25 Sep 2021 16:56 IST

నమస్తే మేడమ్‌.. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మాది, వాళ్లది ఒకటే కులం. కానీ మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కారణం కూడా చెప్పడం లేదు. అతను జాబ్‌ చేస్తున్నాడు. వాళ్లది మంచి కుటుంబం.. పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. కానీ మా తల్లిదండ్రులే ఒప్పుకోవడం లేదు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా చనిపోతామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఆ అబ్బాయి గురించి ఒక్కసారి ఆలోచించడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. దయచేసి మా తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ తల్లిదండ్రులతో మీరు కేవలం ప్రస్తావన పూర్వకంగానే మాట్లాడారా?లేదా మీ ప్రేమపై మీరు ఎంత దృఢంగా ఉన్నారో వారికి చెప్పి చూశారా? కులం సమస్య కాదు కాబట్టి ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమైనా ఉందా? వారు ఒప్పుకోకపోవడానికి అసలు కారణం ఏంటి? ఇతర అభ్యంతరాలు ఏంటి? వంటి విషయాలను శోధించే ప్రయత్నం చేయండి.

ఒకవేళ మీ పెళ్లి విషయంలో మీ తల్లిదండ్రులు తమకున్న అభ్యంతరాలను మీతో చెప్పడానికి సంశయిస్తుంటే మరొకరి సహాయం తీసుకోండి. మీరు, మీ తల్లిదండ్రులు విలువిచ్చే వ్యక్తి లేదా కుటుంబానికి ముఖ్యమైన శ్రేయోభిలాషి ఎవరైనా ఉంటే వాళ్ల ద్వారా కనుగొనవచ్చేమో చూడండి. సాధ్యమైనంత వరకు మీరే ప్రత్యక్షంగా సానుకూల ధోరణితో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మీ తల్లిదండ్రుల అభ్యంతరాలు ఏంటనేవి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసినప్పుడు మీరు, మీరు ప్రేమించిన వ్యక్తి ఇద్దరూ కలిసి వాటికి సమాధానం చెప్పగలుగుతారో లేదో ఆలోచించండి. ఆ తర్వాత వారికున్న సందేహాలను నివృత్తి చేసి, మీ భవిష్యత్తుకు సంబంధించి భరోసాను ఇవ్వగలిగితే వారి మనసు మారుతుందేమో ఆలోచించి చూడండి. కేవలం వాళ్లు వ్యతిరేకిస్తున్నారన్న ఒక్క ఆలోచనతోనే దూరాన్ని పెంచుకోకుండా వాళ్ళు వద్దనడానికి అసలు కారణాలు ఏమై ఉండచ్చు అనేది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్