డెలివరీ తర్వాత జుట్టు రాలుతోంది.. పరిష్కారమేమిటి?

నాకు డెలివరీ అయ్యి 5 నెలలవుతోంది. నా బరువు 63 కిలోలు. ప్రసవం అయినప్పటి నుంచి జుట్టు ఎక్కువగా రాలుతోంది. నాకు థైరాయిడ్‌, పీసీఓఎస్‌ సమస్యలున్నాయి. నా జుట్టు ఊడిపోవడానికి కారణం ఈ సమస్యలేనా? జుట్టు రాలకుండా ఎలా నియంత్రించుకోవాలి?

Published : 08 Jan 2024 12:21 IST

నాకు డెలివరీ అయ్యి 5 నెలలవుతోంది. నా బరువు 63 కిలోలు. ప్రసవం అయినప్పటి నుంచి జుట్టు ఎక్కువగా రాలుతోంది. నాకు థైరాయిడ్‌, పీసీఓఎస్‌ సమస్యలున్నాయి. నా జుట్టు ఊడిపోవడానికి కారణం ఈ సమస్యలేనా? జుట్టు రాలకుండా ఎలా నియంత్రించుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా గర్భంతో ఉన్న సమయంలో హార్మోన్లు, ఇతర కారణాల వల్ల జుట్టు కాస్త ఒత్తుగా పెరుగుతుంది. కానీ డెలివరీ తర్వాత, బిడ్డకు పాలివ్వడం ఆపేశాక.. జుట్టు రాలడం ఎక్కువగా గమనించచ్చు. ఇందుకూ హార్మోన్లలో మార్పులే కారణం. బాలింతల్లో కనీసం సంవత్సరం వరకు ఇలానే జరుగుతుంటుంది.

రోజుకు 100 వెంట్రుకల వరకు ఊడిపోవడాన్ని నిపుణులు సాధారణంగానే పరిగణిస్తారు. అలా కాకుండా జుట్టు ఎక్కువగా, ముద్దలు ముద్దలుగా ఊడిపోతుంటే మాత్రం చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించడం మంచిది. అయితే మీకు థైరాయిడ్‌, పీసీఓఎస్‌ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి ముందుగా గైనకాలజిస్టును సంప్రదించి కొన్ని హార్మోనల్‌ పరీక్షలు చేయించుకోవాలి. జుట్టు రాలడానికి అది సమస్య కాదని తేలితే చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించండి. వారు విటమిన్ల లోపం, జన్యుపరమైన సమస్యల వల్ల జుట్టు ఊడిపోతోందా? ఇతర సమస్యలేవైనా ఉన్నాయా? అనేది పరీక్షిస్తారు. సమస్యను బట్టి తగిన చికిత్స అందిస్తారు. డెలివరీ తర్వాతే ఈ సమస్య తలెత్తుతోందంటే మాత్రం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్