అధరాల అందానికి...

ప్రస్తుతం మాస్కులవల్ల లిప్‌బామ్స్‌, లిప్‌స్టిక్‌ల అవసరం లేకుండా పోయింది. అలాగని పెదాలను నిత్యం సంరక్షించుకోకపోతే క్రమేపీ సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు..  లిప్‌ ఆయిల్‌... నిద్రపోయే ముందు రెండు చుక్కల ఇ విటమిన్‌ ఆయిల్‌ను మునివేళ్లపై వేసుకుని పెదాలపై మృదువుగా రాస్తే రక్తప్రసరణ బాగా ..

Published : 09 Sep 2021 01:20 IST

ప్రస్తుతం మాస్కులవల్ల లిప్‌బామ్స్‌, లిప్‌స్టిక్‌ల అవసరం లేకుండా పోయింది. అలాగని పెదాలను నిత్యం సంరక్షించుకోకపోతే క్రమేపీ సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు..  

లిప్‌ ఆయిల్‌... నిద్రపోయే ముందు రెండు చుక్కల ఇ విటమిన్‌ ఆయిల్‌ను మునివేళ్లపై వేసుకుని పెదాలపై మృదువుగా రాస్తే రక్తప్రసరణ బాగా జరిగి, కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. తేమతో ఆరోగ్యంగా కనిపిస్తాయి.

బాదంనూనె... కలబంద గుజ్జును అధరాలపై రాసి మర్దనా చేయాలి. ఇలా వారంలో మూడు నాలుగుసార్లు చేస్తే పెదాలు మృదువుగా మారి, కాంతిమంతంగా కనిపిస్తాయి. బాదంనూనె లేదా తేనెను కూడా మాయిశ్చరైజింగ్‌కు వినియోగించొచ్చు.

మృతకణాలు... చెంచా చక్కెరకు అరచెంచా తేనె కలిపి పెదాలకు అప్లై చేసి ఆరనివ్వకుండా మృదువుగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తే, మృతకణాలు తొలగి, మెరిసే పెదాలు మీ సొంతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్