పెళ్లి కళ ఇలా!

మరో రెండు వారాల్లో ఏడడుగులు వేయబోతోంది రమ్య. పెళ్లి పీటలెక్కేటప్పటికి తన ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలనుకుంటోంది. అందుకు నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి..ఈ కాలంలో చాలా మందికి చర్మం జిడ్డుగా మారుతుంది.

Updated : 12 Sep 2021 04:39 IST

మరో రెండు వారాల్లో ఏడడుగులు వేయబోతోంది రమ్య. పెళ్లి పీటలెక్కేటప్పటికి తన ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలనుకుంటోంది. అందుకు నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి..

కాలంలో చాలా మందికి చర్మం జిడ్డుగా మారుతుంది. ఇటువంటి చర్మతత్వం ఉన్న వారు బయటికి వెళితే, తప్పక సన్‌స్క్రీన్‌ వాడాలి. మేకప్‌ తక్కువ వేసుకోవాలి. ముఖ్యంగా ఫౌండేషన్‌, మస్కారా వంటివన్నీ వాటర్‌ ప్రూఫ్‌ రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే చెమట, వాతావరణంలోని తేమ, వర్షం ఇవన్నీ మేకప్‌ను కరిగించి, ముఖంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి.

ముందుగా..

వివాహానికి రెండు వారాల ముందుగానే ఉదయంపూట ఫేషియల్‌ స్క్రబ్బింగ్‌, క్లెన్సింగ్‌తో మొటిమలవల్ల వచ్చే మచ్చలను పోగొట్టొచ్చు. ఇందుకోసం అయిదారు బాదంపప్పులను రెండుగంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత చెంచా పెరుగు, ఎండబెట్టిన నిమ్మ, నారింజ తొక్కల పొడి, పుదీనా ఆకుల పొడిని కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తర్వాత చేతివేళ్లను తడి చేసుకుని స్క్రబ్‌ చేయాలి. దీని వల్ల మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.

లేపనం..

బ్లాక్‌హెడ్స్‌ ఉంటే ఓట్‌మీల్‌కు గుడ్డులో తెల్లసొన, కొంచెం తేనె లేదా పెరుగు కలిపి వారానికి రెండుసార్లు రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రంగా నీటితో కడిగితే చాలు. క్రమేపీ ముఖం మెరుపు లీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్