మొటిమలు తగ్గేందుకు పిల్లల సబ్బు!

కొన్నిరోజులు వర్షం, మరికొన్ని రోజులు చెమట.. ఈమధ్య ఒక్కోరోజు ఒక్కోలా ఉంటోంది. మొటిమల సమస్య ఉన్నవారికి ఈ రెండూ ఇబ్బంది కరమే. కాబట్టి కొంత జాగ్రత్త అవసరమంటున్నారు..

Published : 19 Oct 2021 01:57 IST

కొన్నిరోజులు వర్షం, మరికొన్ని రోజులు చెమట.. ఈమధ్య ఒక్కోరోజు ఒక్కోలా ఉంటోంది. మొటిమల సమస్య ఉన్నవారికి ఈ రెండూ ఇబ్బంది కరమే. కాబట్టి కొంత జాగ్రత్త అవసరమంటున్నారు నిపుణులు. కొన్ని సూచనలూ ఇస్తున్నారిలా!

ర్మ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యమివ్వాలి. అందుకు ముఖం కడిగిన వెంటనే మాయిశ్చరైజింగ్‌ తప్పక రాసుకోవాలి. కాలుష్యం కూడా మొటిమలకు ఒక కారణం. కాబట్టి, బయటికి వెళ్లొచ్చాక క్లెన్సింగ్‌ చేయాలి. ఆపై అలోవెరా, లావెండర్‌ గుణాలున్న మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి.  మొటిమలను తాకొద్దు. ఈ సమస్య ఉన్నప్పుడు పరిమళాలు లేనిని సబ్బులను వాడాలి. బేబీ సోప్‌ వాడితే ఇంకా మంచిది.

* యాక్నే ఉన్నచోట పూతలు వేయొద్దు. శుభ్రతకు గోరువెచ్చని లేదా చల్లని నీటినే వాడాలి. ఐస్‌క్యూబ్‌తో రుద్దినా ఉపశమనముంటుంది. కారం, మసాలాలు తగ్గించాలి. డ్రైఫ్రూట్స్‌, పండ్లు, చేపలు, ఆకుకూరలు రోజువారీ ఆహారంలో తప్పనిసరి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. సమస్య ఏమాత్రం ఎక్కువగా ఉన్నా.. వైద్యుల సలహా తీసుకోవాలి. సొంతంగా ఎలాంటి ప్రయోగాలూ చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్