అనుపమ అందం వెనుక..

బ్యూటీపార్లర్‌కు వెళ్లడం, కఠినమైన రసాయనాలున్న ఉత్పత్తులను ఉపయోగించడం అనుపమ పరమేశ్వరన్‌కు నచ్చదట. తన చర్మ సంరక్షణ స్వయంగా చూసుకుంటా నంటోంది. ఇంకా.. ‘కాఫీ, తేనె మాస్క్‌ను ఎక్కువగా...

Updated : 21 Oct 2021 06:06 IST

బ్యూటీపార్లర్‌కు వెళ్లడం, కఠినమైన రసాయనాలున్న ఉత్పత్తులను ఉపయోగించడం అనుపమ పరమేశ్వరన్‌కు నచ్చదట. తన చర్మ సంరక్షణ స్వయంగా చూసుకుంటా నంటోంది. ఇంకా.. ‘కాఫీ, తేనె మాస్క్‌ను ఎక్కువగా ఉపయోగిస్తా. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది. రెండు స్పూన్ల చొప్పున కాఫీ పొడి, తేనె కలిపి ముఖానికి పట్టించి, 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు. రోజులో కాసేపు వ్యాయామానికి కేటాయిస్తా. ఇదీ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మంచినీటినీ ఎక్కువగా తీసుకుంటా. మరీ అవసరమైతే తప్ప మేకప్‌ని అదీ తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తా’ అని చెబుతోంది. తేలికైన సలహా అనిపిస్తోంది కదూ! ప్రయత్నిస్తారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్