అందానికి పెట్రోలియం జెల్లీ...

చలికాలంలో చాలామంది ఉపయోగిస్తారు దీన్ని. ఇది చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు అందాన్నీ కాపాడుతుంది.

Updated : 26 Oct 2021 06:28 IST

చలికాలంలో చాలామంది ఉపయోగిస్తారు దీన్ని. ఇది చర్మానికి తేమను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు అందాన్నీ కాపాడుతుంది.

కనురెప్పలు కొత్తగా... రోజూ రాత్రి పడుకునే ముందు కాస్తంత కొబ్బరి నూనెలో పెట్రోలియం జెల్లీ కలిపి రెప్పలకు రాసుకుంటే ఒత్తుగా పెరుగుతాయి.

ఐ బ్రో జెల్‌... కనుబొమలు చక్కగా, కుదురుగా ఉండేలా కనిపించాలంటే కొద్దిగా ఈ జెల్‌ను రాస్తే సరి.

జుట్టుకు మాత్రమే రంగు పడేలా.. కేశాలకు రంగు వేసుకునే ముందు మెడ, చెవుల కింద దీన్ని రాసుకోవాలి. ఇలా చేస్తే డై మరకలు అంటుకోవు.

మృదువైన క్యూటికల్స్‌కు... కాస్తంత పెట్రోలియం జెల్లీ తీసుకుని గోళ్లపై మృదువుగా రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

మేకప్‌ రిమూవర్‌గా... కళ్లు, పెదాలపై మేకప్‌ను తొలగించడానికి దీన్ని వాడుకోవచ్చు.

మృదువైన పెదాలకు... నిద్రకు ముందు తప్పని సరిగా దీన్ని అధరాలకు పట్టించాలి. అప్పుడే అవి తేమతో, ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

బ్లాక్‌ హెడ్స్‌ తొలగించడానికి.. ఇవి ఉన్న చోట పెట్రోలియం జెల్లీని కాస్త ఎక్కువగా రాసి మందమైన పొరలా చేయాలి. ఆ తర్వాత తీసేస్తే సరి.

కోమలమైన పాదాలకు.. రోజూ నిద్రపోయే ముందు దీన్ని కాళ్లకు పట్టిస్తే పొడి బారకుండా మృదువుగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్