డ్రై బ్రష్షింగ్‌.. తెలుసా?

శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. ఇందుకోసం మర్దనా చేయడానికి వినియోగించే మాయిశ్చరైజింగ్‌, కోల్డ్‌ క్రీంలన్నీ చర్మంపై మృతకణాలు చేరుకునేలా చేస్తాయి.  వీటిని  ఎప్పటికప్పుడు తొలగించకపోతే దురద, ఎలర్జీ వంటి

Updated : 29 Dec 2021 05:11 IST

శీతాకాలంలో చర్మం పొడిబారుతుంది. ఇందుకోసం మర్దనా చేయడానికి వినియోగించే మాయిశ్చరైజింగ్‌, కోల్డ్‌ క్రీంలన్నీ చర్మంపై మృతకణాలు చేరుకునేలా చేస్తాయి.  వీటిని  ఎప్పటికప్పుడు తొలగించకపోతే దురద, ఎలర్జీ వంటి పలురకాల అనారోగ్యాలబారిన పడే ప్రమాదం ఉంది. దీనికి డ్రై బ్రష్షింగ్‌ పరిష్కారం అంటున్నారు నిపుణులు.

మెరుపునిస్తుంది...  సబ్బు, లోషన్స్‌తో శుభ్రపరిచినప్పుడు మృతకణాలను కొంతశాతమే తొలగించగలం. మెత్తని బ్రష్‌ను పొడిచర్మంపై రుద్దాలి. చర్మానికి హానికలగకుండా, మృతకణాలు వదులడమేకాక చర్మకణాలు ఉత్తేజమై,  రక్తప్రసరణ బాగా జరుగుతుంది. డిటాక్సిఫైయింగ్‌ అని కూడా పిలిచే ఈ డ్రై బ్రష్షింగ్‌ తో చర్మం మెరుస్తుంది.

నిత్యం..  ప్రతి రోజు స్నానానికి ముందు దీన్ని చేయాలి. బ్రష్‌  తేలికగా శరీరంపై కదలటానికి  సౌకర్యంగా ఉండేలా, అలాగే మృదువుగా ఉండేదాన్ని ఎంచుకోవాలి. ముఖం తప్ప శరీరమంతా చేయొచ్చు. ఇది పూర్తియిన తర్వాత బ్రష్‌ను కూడా శుభ్రపరచడం మరవకూడదు. కాళ్ల నుంచి శరీరం పైకి బ్రష్షింగ్‌ చేయడం సరైన పద్ధతి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసి మాయిశ్చరైజింగ్‌ లేదా కొబ్బరినూనెను అప్లై చేస్తే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్