ఈ నూనె మేలెంతో...

మహిళల్లో చాలా మంది బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి తోడు నిస్సత్తువ, ఆందోళన, ఒత్తిడి సమస్యలూ ఉంటాయి. వీటన్నింటికీ వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. శరీరాన్ని శక్తిమంతం చేయడం,

Updated : 19 Feb 2022 06:20 IST


మహిళల్లో చాలా మంది బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి తోడు నిస్సత్తువ, ఆందోళన, ఒత్తిడి సమస్యలూ ఉంటాయి. వీటన్నింటికీ వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. శరీరాన్ని శక్తిమంతం చేయడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వంటి పలు ప్రయోజనాలున్న ఈ నూనె రోజూ ఆహారంలో ఉండాలని సూచిస్తున్నారు...

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి. పగిలిన లేదా అలర్జీ ఉన్న ప్రాంతంలో ఈ నూనెను మృదువుగా పూతలాగా రాస్తూ ఉండాలి. ఇది అక్కడి చర్మకణాలను ఆరోగ్యంగా మారుస్తుంది. చర్మంపై మచ్చలను తొలగించే ఔషధగుణాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. నోట్లోని సూక్ష్మక్రిములను సంహరించే ఔషధగుణాలు ఈ నూనెలో ఉన్నాయి. ఉదయాన్నే బ్రష్‌ చేసుకున్న తర్వాత చెంచా నూనె నోట్లో వేసుకుని బాగా పుక్కిలిస్తే మంచిది. ఇది నోటిని తాజాగా ఉంచడమే కాకుండా, బ్యాక్టీరియాను తరిమి కొడుతుంది. జీర్ణాశయంలోకి వెళ్లే సూక్ష్మక్రిములను నిరోధిస్తుంది.    

ఫిట్‌నెస్‌కు... సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉండే ఈ కొబ్బరి నూనెను రోజూ వంటకాల్లో వినియోగిస్తే, శరీరంలో కెలొరీలు పెరగకుండా చేస్తుంది. దీంతో బరువు సమస్య ఉండదు. అలాగే ఇందులోని ఫ్యాటీ యాసిడ్లు వ్యాధి నిరోధకశక్తిని పెంచి అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇందులో ట్రైగ్లిసరాయిడ్స్‌ ఉండటంతో ఇవి కొబ్బరి నూనెను శరీరంలో నేరుగా కాలేయానికి చేర్చి కార్బోహైడ్రేట్స్‌గా మార్చడంలో దోహదపడతాయి. దీంతో తక్షణశక్తి అందుతుంది. ఈ కారణంగానే క్రీడాకారులు పోషకాహారాల్లో ఈ నూనెను ఎక్కువగా వినియోగిస్తారు.

జీవక్రియలు.. పచ్చి కొబ్బరి నూనె శరీరంలోని జీవ క్రియలను సమతుల్యం చేస్తుంది. కనీసం రోజుకి రెండు చెంచాల నూనెను ఆహారం ద్వారా తీసుకోవడం మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను పెరగకుండా రక్షిస్తూ, హృద్రోగాలను దరిచేరనివ్వకుండా చేస్తాయి. అంతేకాదు.. మానసికాందోళన, ఒత్తిడి వంటి సమస్యలనూ దూరంగా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్