ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించాలంటే...

ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ దానిపేరు మర్చిపోయినట్టు... ఇల్లు, పిల్లలు, ఆఫీసు... ఈ బాధ్యతల్లో పడి మనల్ని మనం మర్చిపోతుంటాం. తెలియకుండానే రోజులు గడిచిపోతుంటాయి. అలా కాకుండా కొన్ని నియమాలూ, అలవాట్లతో జీవితంలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించవచ్చంటున్నారు నిపుణులు.

Published : 09 Apr 2022 01:49 IST

ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ దానిపేరు మర్చిపోయినట్టు... ఇల్లు, పిల్లలు, ఆఫీసు... ఈ బాధ్యతల్లో పడి మనల్ని మనం మర్చిపోతుంటాం. తెలియకుండానే రోజులు గడిచిపోతుంటాయి. అలా కాకుండా కొన్ని నియమాలూ, అలవాట్లతో జీవితంలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించవచ్చంటున్నారు నిపుణులు.

చాలాసార్లు చేయాల్సిన పనుల గురించో, చేసినవాటి గురించో ఆలోచిస్తాం. దీనివల్ల సమయం వృథా కావడంతోపాటే, అనవసర ఆందోళన. ఇలాంటి సమయంలో ఒకట్రెండు నిమిషాలు దీర్ఘశ్వాస తీసుకుంటూ ధ్యానం చేయాలి. విరామ సమయంలో లేదంటే ప్రతి గంట, రెండు గంటలకోసారి ఇలా చేయడం అలవాటు చేసుకోండి. నిస్సహాయంగా, అలసటగా అనిపించినా ఇలా చేసి చూడండి.

బుల్లెట్‌ జర్నల్‌... చిన్న డైరీలాంటి పుస్తకంలో రోజువారీ చేయాల్సిన పనుల్ని రాసిపెట్టుకోండి. దీనివల్ల ముఖ్యమైన పనులకి సమయం కేటాయిస్తూ అనవసరమైన విషయాల జోలికిపోకుండా ఉంటారు. వారానికోసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే జాబితా నుంచి ఏమేం తొలగించవచ్చో, ఏం చేర్చవచ్చో కూడా తెలుస్తుంది.

సమాచారం ఎక్కువ కానివ్వొద్దు... సోషల్‌ మీడియా, టీవీ చూస్తే నిరంతరం సమాచారం వస్తూనే ఉంటుంది. వీటిని చూసినప్పుడల్లా భావోద్వేగాలకు గురవుతుంటారు. కొన్ని విషయాలు అనవసర ఒత్తిడి కలిగిస్తాయి. అందుకే ఆహారానికి పెట్టుకున్నట్టే సమాచారానికీ పరిమితి పెట్టుకోండి. ఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో పత్రికలు చదవడం... లేదంటే ఆఫీసుకి వెళ్లేటపుడూ, తిరిగి వచ్చేటపుడు పాడ్‌కాస్ట్‌లు వినడం ద్వారా ఆరోజు ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. సోషల్‌ మీడియాకి రోజు, రెండ్రోజులూ, వారం ఇలా విరామం ఇవ్వండి. సమయం దొరికితే కుటుంబ సభ్యులతో కూర్చోండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం... వంటివి చేయండి.

ఇంతేకాదు, సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో, షెల్ఫ్‌లలో పనికిరాని వస్తువుల్ని తీసిపడేయండి. దీనివల్ల కావాల్సిన వాటిని గుర్తించడం సులభమవుతుంది. స్నేహితుల్ని కలుస్తుండండి. దీనివల్ల నూతనోత్తేజం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్