చర్మానికీ.. డీటాక్సింగ్‌!

ఇప్పుడు స్కిన్‌ కేర్‌ రొటీన్‌ సాధారణమైపోయింది. ఒకదాని తర్వాత ఒకటి బోలెడు ఉత్పత్తులు రాస్తున్నా ఒక్కోసారి ఏదో ఒక సమస్య! అవి దూరమవ్వాలంటే చర్మానికీ డీటాక్సింగ్‌ కావాలంటున్నారు నిపుణులు.

Published : 24 Aug 2022 01:27 IST

ఇప్పుడు స్కిన్‌ కేర్‌ రొటీన్‌ సాధారణమైపోయింది. ఒకదాని తర్వాత ఒకటి బోలెడు ఉత్పత్తులు రాస్తున్నా ఒక్కోసారి ఏదో ఒక సమస్య! అవి దూరమవ్వాలంటే చర్మానికీ డీటాక్సింగ్‌ కావాలంటున్నారు నిపుణులు.

దీన్నే స్కిన్‌ ఫాస్టింగ్‌గా కూడా చెప్పొచ్చు. పూజ, డైటింగ్‌ పేరుతో అప్పుడప్పుడూ ఉపవాసం ఉంటాం కదా! చర్మం విషయంలోనూ అదే చెయ్యాలి. అంటే ముఖం కడిగాక కొద్ది గంటలపాటు దానికి ఏ ఉత్పత్తీ రాయకుండా అలా వదిలేయడమన్న మాట. దీంతో స్కిన్‌కి తనను తాను రిపేర్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది.

* చర్మ సమస్య అనుకోండి.. ఏం చేస్తాం? స్నేహితుల సలహా అడుగుతాం, అవునా! సలహా తీసుకున్నారు సరే. కానీ.. ఇద్దరిదీ ఒకే చర్మతీరు కాకపోతే? సమస్య తగ్గకపోగా పెద్దదవొచ్చు. ఈ విధానంలో చర్మం ఊపిరి పీల్చుకున్నట్లుగా అవడమే కాదు సహజ నూనెలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీ చర్మతీరేదో తెలుస్తుంది. దానికి అనుగుణంగా తీసుకునే చర్యలు లాభిస్తాయి.

* మీరు వాడే ఉత్పత్తులు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికీ ఇది ఉత్తమ మార్గం. స్కిన్‌ ఫాస్టింగ్‌ తర్వాతా చర్మం ఆరోగ్యంగా కనిపిస్తోందంటే ఆ ఉత్పత్తులను కొనసాగించొచ్చు. లేదంటే మార్చుకోవచ్చు.

* బాగా పొడి, సున్నిత చర్మం, యాక్నే వంటి సమస్యలు ఉన్న వారు మాత్రం దీన్ని ప్రయత్నించకపోవడమే మంచిది. వాళ్లు క్రీములను తప్పనిసరిగా కొనసాగించాలి. ఈ పద్ధతిని రాత్రిపూట లేదా ఇంట్లో ఉన్న సమయంలోనే పాటించాలి. సన్‌స్క్రీన్‌ వంటివి లేకుండా ఎండలోకి వెళితే చర్మం దెబ్బతింటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్