పెంకూ గుడ్డే!

కోడిగుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసు. దాని పెంకుతోనూ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా!

Published : 27 Oct 2022 00:19 IST

కోడిగుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలుసు. దాని పెంకుతోనూ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా!

* గుడ్డు సొనను ముఖానికి మాస్క్‌లా వేస్తుంటాం కదా! ఇకనుంచి గుడ్డు పెంకుల్ని పొడిచేసి రోజూ కొద్దిగా తీసుకోండి. దీనిలోని హ్యాలురోనిక్‌ ఆసిడ్‌ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. ఇతర పోషకాలు కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి.

* అప్పుడప్పుడూ శరీరాన్ని డిటాక్స్‌ చేస్తుంటాం. ఆ పని గుడ్డుపెంకులూ చేస్తాయట. వీటి పొడిని రోజూ గ్లాసునీటిలో చిటికెడు కలుపుకొని తాగితే మలినాలు తొలగుతాయట.

* ముప్పయ్‌లోకి వచ్చినప్పటి నుంచే మనకు క్యాల్షియం తగ్గుతుంది. పిల్లలు పుట్టాక ఈ సమస్య మరీ బాధిస్తుంది. అందుకే క్యాల్షియం సప్లిమెంట్లూ సూచిస్తుంటారు. బదులుగా ఈ పెంకుల పొడిని తీసుకుంటే క్యాల్షియం అందడమే కాదు రక్తంలోని మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం స్థాయుల్నీ క్రమబద్ధం చేస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరచి ఆస్టియోపోరోసిస్‌నూ దూరం చేస్తుంది.

* థైరాయిడ్‌ సమస్యలకూ  చక్కని మందు. గుడ్డు పెంకుల పొడికి నిమ్మ రసం కలిపి ఓ వారం ఫ్రిజ్‌లో ఉంచాలి. దీన్ని స్పూను చొప్పున తీసుకొని నీరు లేదా ఏదైనా జ్యూస్‌కు కలుపుకొని తాగాలి. కావాలంటే తేనెనీ జోడించుకోవచ్చు. పాలల్లో చిటికెడు పొడిని కలిపి తాగుతుంటే గ్యాస్ట్రిక్‌, అల్సర్‌ సమస్యలూ దూరమవుతాయి. కాబట్టి, ఇకనుంచి కూర, ఆమ్లెట్‌లో పొరపాటున చిన్న పెంకు పడినా ఇంట్లో వాళ్ల ఆరోగ్యం కోసమేనని చెప్పేయొచ్చన్న మాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్