కాటన్‌లో మెరిసేలా..

వేసవి నుంచి కాపాడుకునేందుకు కాటన్‌వస్త్రాలను ఎంచుకొంటాం. ఇవి చెమటను పీల్చి, శరీరానికి చల్లదనాన్నిస్తాయి. కానీ కాటన్‌ దుస్తులు ధరిస్తే ట్రెండీగా ఉండవని పక్కన పెట్టేస్తారు కొందరు. కానీ వీటితోనూ వారెవ్వా అనిపించొచ్చు.

Published : 09 Apr 2023 00:45 IST

వేసవి నుంచి కాపాడుకునేందుకు కాటన్‌వస్త్రాలను ఎంచుకొంటాం. ఇవి చెమటను పీల్చి, శరీరానికి చల్లదనాన్నిస్తాయి. కానీ కాటన్‌ దుస్తులు ధరిస్తే ట్రెండీగా ఉండవని పక్కన పెట్టేస్తారు కొందరు. కానీ వీటితోనూ వారెవ్వా అనిపించొచ్చు. అదెలాగో చూద్దామా..

* కాటన్‌ దుస్తుల్లోనూ చాలారకాల ప్రింట్‌లూ, మోడళ్లు వస్తున్నాయి. మీకు నప్పే లేత రంగులవి ఎంచుకుంటే మేలు. మనసుకు హాయినిస్తాయి.

* కుర్తీలకు ప్లాజో, యాంకెల్‌ లెంత్‌ జత చేస్తే ట్రెండీగా కనిపించొచ్చు. లేత రంగు కుర్తాకి ప్లాజో, ఫ్యాన్సీ దుపట్టా జత అయితే హుందాగా కనిపించొచ్చు. ఆఫీసుకు వెళ్లడానికి ఇది చక్కని ఎంపిక.

*  స్లీవ్‌లెస్‌వీ అందంగా ఉంటాయి. అవి మీకు అసౌకర్యంగా అనిపిస్తే వదులు చేతులున్నవి తెచ్చేసుకోండి.

* దుస్తులతో పాటు యాక్సెసరీలూ ముఖ్యమే. మరీ హంగులూ, ఆర్భాటాలూ లేని బ్యాగులు, జ్యూవెలరీ ఎంచుకోండి. సన్న చెయిన్‌, చిన్న స్టడ్స్‌, భుజాలకు తాకని జుంకీలు చూడటానికీ బాగుంటాయి. చిరాకునీ కలిగించవు.

*  అటు ట్రెండీగా, ఇటు సంప్రదాయంగా కనిపించాలంటే చీరలూ ఉత్తమ ఎంపికే! హడావుడి లేని, తక్కువ బరువున్న, ప్రింట్‌లూ, డిజైన్‌లూ ఎక్కువగా లేనివైతే కట్టుకోవడమూ సులువు. మోడర్న్‌గానూ కనిపిస్తారు. తక్కువ ఎత్తు శాండిల్స్‌ వేసుకుంటే సరి. ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్