నూనె మర్దనా అవసరమే..

అసలే వేసవి.. తలకి నూనె రాస్తే ముఖం కూడా జిడ్డుగా మారుతుందనుకుంటాం. అందుకే వీలైనంత దూరం పెడుతుంటాం. కానీ వేడికి జుట్టు కళావిహీనంగా మారుతుంది.

Published : 17 Apr 2023 00:24 IST

అసలే వేసవి.. తలకి నూనె రాస్తే ముఖం కూడా జిడ్డుగా మారుతుందనుకుంటాం. అందుకే వీలైనంత దూరం పెడుతుంటాం. కానీ వేడికి జుట్టు కళావిహీనంగా మారుతుంది. పోషణా అందదు. కాబట్టి.. వీలున్నప్పుడల్లా పట్టించేయండి.

* ఎండకు బయటికి వెళ్లొస్తాం. ఆ వేడికి మాడు నొప్పి కూడా వస్తుంది. తలపై చర్మం పొడిబారడం వల్లే ఈ సమస్య. కాబట్టి, కొబ్బరి, బాదం, ఆముదం ఇలా ఏదో ఒక నూనెతో తలకు మసాజ్‌ చేయాలి. నూనె తలలోకి ఇంకి మాడు చల్లబడుతుంది. హాయిదనం కలుగుతుంది. ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే సరి. కుదుళ్లకు కావాల్సిన తేమా అంది, కురులు మృదువుగా మారతాయి.

* వేగంగా పని ముగుస్తుందని తల ఆరబెట్టేందుకు డ్రైయ్యర్లు వాడతాం. వాటి పర్యవసానాలు ఏంటో తర్వాత తెలుస్తాయి. వీటి నుంచి వెలువడే వేడికి వెంట్రుకలు గడ్డిలా తయారవుతాయి. అవి తిరిగి జీవం నింపుకోవాలన్నా.. ఆరోగ్యంగా ఎదగాలన్నా కనీసం వారానికోసారైనా నూనెతో మసాజ్‌ తప్పనిసరి.

* తలపై చుండ్రుకు చెమట కూడా కారణమే. దీనికి దురద, దద్దుర్లు అదనమై ఇబ్బంది పెడతాయి. ఇలాంటప్పుడు కొద్దిగా వేపనూనెతో మాడుకు మసాజ్‌ చేస్తే చుండ్రు సమస్య తగ్గటమే కాదు.. ఇతర ఇన్ఫెక్షన్ల నుంచీ విముక్తి.

* వెంట్రుకల్లో నూనె పాళ్లు తగ్గడం కూడా తెల్లబడటానికి కారణమే. కాస్త వేపాకు, కరివేపాకు వేసి, కాగబెట్టిన నూనెను పట్టించండి. శిరోజాలు నల్లగా నిగనిగలాడతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని