ఒత్తయిన కనుబొమలు కావాలా..

కళ్లు చిన్నవైనా, పెద్దవైనా కనుబొమలు మాత్రం ఒత్తుగా ఉండాలని భావిస్తారు. అవే మోముని అందంగా కనిపించేలా చేస్తాయని నమ్ముతారు. వీటిని పెన్సిల్‌తో తీర్చిదిద్దుకుని మురిసిపోతారు.

Published : 29 May 2023 00:11 IST

కళ్లు చిన్నవైనా, పెద్దవైనా కనుబొమలు మాత్రం ఒత్తుగా ఉండాలని భావిస్తారు. అవే మోముని అందంగా కనిపించేలా చేస్తాయని నమ్ముతారు. వీటిని పెన్సిల్‌తో తీర్చిదిద్దుకుని మురిసిపోతారు. మరి అవి సహజంగా పెరగాలంటే... 

* కనుబొమలు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో ఆముదానికి మించిందేమీ లేదు. సహజంగా దొరికే ఈ తైలంలో విటమిన్‌ ఎ, ఇ ఉంటాయి. రోజూ రాత్రి నిద్రపోయే ముందు రెండు చుక్కలు రాసుకుని ఓ ఐదారు నిమిషాలు మృదువుగా మర్దన చేయండి చాలు. క్రమంగా మార్పు కనిపిస్తుంది.

* అందరికీ అందుబాటులో ఉండే కొబ్బరినూనె వెంట్రుకల పెరుగుదలకు చక్కగా పనిచేస్తుంది. దీన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుని రాసి రుద్దాలి. ఇలా కనీసం ఓ పావుగంటైనా రోజూ చేస్తుంటే ఇందులోని పోషకాలు కనుబొమల్ని ఒత్తుగా మారుస్తాయి.

* ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. దీనిలో ఉండే సల్ఫర్‌ కనుబొమలు ఒత్తుగా పెరిగేటట్లు చేస్తుంది. ఉల్లిరసాన్ని కొద్దిగా తీసుకుని ఓ పదినిమిషాలు రాసి ఆరనివ్వండి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని