ఒత్తయిన కురులకూ వ్యాయామం..

మనలో చాలామంది అధిక బరువు తగ్గాలనో, బలాన్ని పెంచుకోవడానికో లేదా ఒత్తిడి తగ్గించుకోవాలనో వ్యాయామం చేస్తుంటాం. కానీ వ్యాయామంతో దృఢమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా! అందుకు నిపుణుల సలహా ఏంటంటే..

Updated : 09 Jun 2023 03:41 IST

మనలో చాలామంది అధిక బరువు తగ్గాలనో, బలాన్ని పెంచుకోవడానికో లేదా ఒత్తిడి తగ్గించుకోవాలనో వ్యాయామం చేస్తుంటాం. కానీ వ్యాయామంతో దృఢమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా! అందుకు నిపుణుల సలహా ఏంటంటే..

* వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దాంతో రక్త కణాలకు తగినంత ఆక్సిజన్‌ అంది కుదుళ్లు బలపడతాయి. జుట్టూ పెరుగుతుంది.

* ఒత్తిడి ఉంటే జుట్టు రాలిపోతుంది. వ్యాయామం చేయటం వల్ల మనలో ఎండార్ఫిన్లు ఉత్పత్తయ్యి ఒత్తిడి తగ్గిస్తాయి. అయితే అందులోనూ ఏరోబిక్‌,  కార్డియో వంటి వ్యాయామాలు కురులు పెరుగుదలకు బాగా సహకరిస్తాయి.

 * అన్నింటికన్నా ముఖ్యంగా పోషకాహారం తీసుకోవటం తప్పనిసరి. దాంతో పాటు నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని