పొడవుగా కనిపించాలా!

ఎంతందమైన దుస్తులు ధరించినా... పొట్టిగా కనిపిస్తున్నామని బాధపడిపోతున్నారా? మీకోసమే ఈ సూచనలు చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు.

Updated : 25 Oct 2023 03:38 IST

ఎంతందమైన దుస్తులు ధరించినా... పొట్టిగా కనిపిస్తున్నామని బాధపడిపోతున్నారా? మీకోసమే ఈ సూచనలు చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు..

  • అసలు ఎత్తుకంటే కాస్త పొడవుగా కనిపించేలా చేయడం భ్రమే అయినా.... ఎదుటివారి కళ్లను ఏమార్చగలిగే శక్తి దుస్తులకు ఉంది. షార్ట్‌ టాప్‌లు, పలాజో ప్యాంట్‌లూ, సింగిల్‌పీస్‌ లాంగ్‌గౌన్‌లూ, షరారాలు వంటివి పొడవుగా కనిపించేలా చేస్తాయి.
  • స్ట్రెయిట్‌ కట్‌ కుర్తీలూ, ఏ లైన్‌ టాప్‌లూ వంటివీ మీ శరీరాకృతిని చక్కగా కనిపించేలా చేస్తాయి. పెద్ద పెద్ద ప్రింట్లు మీరు ఎత్తు తక్కువగా కనిపించేలా చేస్తాయి.  
  • చాలావరకూ పట్టు రకాలు బ్రొకేడ్‌, జరీ హంగులూ, బారీ బార్డర్లతో ఆడంబరంగా కనిపిస్తాయి. వీటిని కట్టుకుంటే మనమూ కాస్త బొద్దుగా కనిపిస్తాం. ఎత్తు తక్కువున్నట్లూ అనిపిస్తాం. అందుకే, వీటికి బదులు రాసిల్క్‌, బెనారస్‌, జార్జెట్‌, షిఫాన్‌, క్రేప్‌, విస్కోస్‌, లైక్రా మిక్స్‌డ్‌ కాటన్‌ వంటి ఫ్యాబ్రిక్‌ రకాలను ఎంచుకోండి. వీటిల్లో సన్నగానే కాదు.. పొడవుగానూ కనిపిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్